Kadapa: ‘నోరు మూసుకోండి..’ షర్మిల, సునీతలకు మేనత్త వార్నింగ్
నిస్వార్థంగా పని చేస్తున్న జగన్‌ను ఇబ్బంది పెట్టాలని షర్మిల, సునీత చూస్తున్నారని.. మేనత్త వైఎస్ విమలమ్మ పేర్కొన్నారు. వాళ్లు ఇన్ని ఆరోపణలు చేస్తున్నా.. అవినాష్ తిరిగి ఒక్క మాట అనలేదని చెప్పారు. షర్మిల, సునీతలకు దైవంపై విశ్వాసం పోయిందని అన్నారు.
ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల, సునీత చర్యలతో.. వైఎస్ ఆత్మ ఘోషిస్తుందన్నారు రాజశేఖర్ రెడ్డి చెల్లెలు విమలా రెడ్డి. కొంగు పట్టుకుని ఓట్లు అడుక్కునే వాళ్లు వైఎస్ఆర్ బిడ్డ ఎలా అవుతారని ప్రశ్నించారు. రాజశేఖర్ రెడ్డి శత్రువులంతా షర్మిల చుట్టూ చేరారని చెప్పారు. పులివెందులలో పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు విమలా రెడ్డి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Published on: Apr 13, 2024 02:06 PM
వైరల్ వీడియోలు
Latest Videos