AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణలో రేపటి నుంచి మూడు రోజుల పాటు వడగండ్ల వర్షాలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ.

మార్చి మధ్యలోనే ఎండలు దంచికొడుతున్నాయి. మరీ ముఖ్యంగా మధ్యాహ్నం పూట అడుగు బయటపెట్టాలంటే భయపడే పరిస్థితి ఉంది. అయితే ఇలా ఉన్న వాతావరణంలో ఒక్కసారిగా మార్పు రానుంది. రాష్ట్రంలో బుధవారం నుంచి వాతావరణం పూర్తిగా మారనుంది. బుధవారం నుంచి..

Telangana: తెలంగాణలో రేపటి నుంచి మూడు రోజుల పాటు వడగండ్ల వర్షాలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ.
Rains
Narender Vaitla
|

Updated on: Mar 14, 2023 | 8:32 AM

Share

మార్చి మధ్యలోనే ఎండలు దంచికొడుతున్నాయి. మరీ ముఖ్యంగా మధ్యాహ్నం పూట అడుగు బయటపెట్టాలంటే భయపడే పరిస్థితి ఉంది. అయితే ఇలా ఉన్న వాతావరణంలో ఒక్కసారిగా మార్పు రానుంది. రాష్ట్రంలో బుధవారం నుంచి వాతావరణం పూర్తిగా మారనుంది. బుధవారం నుంచి నాలుగు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి రాష్ట్రంలో పశ్చిమ దిశగా వీస్తున్న గాలుల ద్రోణి సోమవారం బలపడడంతో..గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఓవైపు వర్షంతో పాటు పలు జిల్లాల్లో 36 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలూ ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 16, 17 తేదీల్లో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వడగండ్ల వాన, 17న ఉత్తర, పశ్చిమ, ఈశాన్య జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది.

* గురువారం ఆదిలాబాద్‌, కుమ్రంభీం, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, మంచిర్యాల, కామారెడ్డి, సిరిసిల్ల, వరంగల్‌, హన్మకొండ, మహబూబాబాద్‌, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

* శుక్రవారం ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయి.

* శనివారం ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్‌, కుమ్రంభీం, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, వరంగల్‌, హన్మకొండ, కామారెడ్డి, ములుగు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన కురిసే అవకాశం ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మూడు రోజుల పాటు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
రోహిత్, విరాట్‌లకు అంత సీన్ లేదుగా.. అగ్రస్థానంలో ఐదుగురు..!
రోహిత్, విరాట్‌లకు అంత సీన్ లేదుగా.. అగ్రస్థానంలో ఐదుగురు..!
మగువలకు తీపి కబురు.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..
మగువలకు తీపి కబురు.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..
ఓటీటీలోకి వచ్చిన బైకర్, రాకాస సినిమాలు.. స్ట్రీమింగ్ వివరాలివే
ఓటీటీలోకి వచ్చిన బైకర్, రాకాస సినిమాలు.. స్ట్రీమింగ్ వివరాలివే
మరో 2 రోజుల్లో తెలంగాణ RJC CET 2026 పరీక్ష.. హాల్‌ టికెట్ల లింక్
మరో 2 రోజుల్లో తెలంగాణ RJC CET 2026 పరీక్ష.. హాల్‌ టికెట్ల లింక్
టెన్త్‌, ఇంటర్ రిజల్ట్స్.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
టెన్త్‌, ఇంటర్ రిజల్ట్స్.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
వైశాఖ పౌర్ణమి మహత్యం.. పూజా విధానాలు, దాన ధర్మాలు.. ఆశ్చర్యకర..
వైశాఖ పౌర్ణమి మహత్యం.. పూజా విధానాలు, దాన ధర్మాలు.. ఆశ్చర్యకర..
UGC NET జూన్‌ 2026 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. లింక్ ఇదే
UGC NET జూన్‌ 2026 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. లింక్ ఇదే
56 ఏళ్ల వయసులోనూ తగ్గని పరువం.. పాప్ సింగర్..
56 ఏళ్ల వయసులోనూ తగ్గని పరువం.. పాప్ సింగర్..
టెన్త్‌ సప్లిమెంటరీ, రీకౌంటింగ్‌ 2026కు ఫీజు చెల్లింపులు ప్రారంభం
టెన్త్‌ సప్లిమెంటరీ, రీకౌంటింగ్‌ 2026కు ఫీజు చెల్లింపులు ప్రారంభం
మే 1 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆదాయం, ఉద్యోగాల్లో శుభవార్తలు..
మే 1 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆదాయం, ఉద్యోగాల్లో శుభవార్తలు..