AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: అనాధకు బీమా చేయించి.. చంపేశారు.. పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు..

నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వీటిని అడ్డుకునేందుకు, నియంత్రించేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపడుతున్నా అడ్డుకట్ట పడటం లేదు. డబ్బు కోసం మానవత్వాన్ని మంట గలిపేస్తున్నారు. తాజాగా షాద్ నగర్ లో ఇలాంటి...

Telangana: అనాధకు బీమా చేయించి.. చంపేశారు.. పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు..
Murder
Ganesh Mudavath
|

Updated on: Jan 10, 2023 | 7:00 PM

Share

నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వీటిని అడ్డుకునేందుకు, నియంత్రించేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపడుతున్నా అడ్డుకట్ట పడటం లేదు. డబ్బు కోసం మానవత్వాన్ని మంట గలిపేస్తున్నారు. తాజాగా షాద్ నగర్ లో ఇలాంటి ఘటనే జరిగింది. అనాథకు బీమా చేయించి.. డబ్బు కోసం దారుణంగా చంపేశారు. అనంతరం రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు. పోలీసులు తమదైన స్టైల్ లో విచారణ జరపగా.. అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. వరంగల్‌ జిల్లా చెన్నారావుపేట మండలం బోడతాండాకు చెందిన బోడ శ్రీకాంత్‌.. జల్సాలకు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో డబ్బులు సంపాదించేందుకు మోసాలకు పాల్పడుతున్నాడు. హైదరాబాద్‌ శివారు మేడిపల్లికి చెందిన భిక్షపతి శ్రీకాంత్‌ వద్ద డ్రైవరుగా పనిచేసేవాడు. అనాథయిన అతని పేరుమీద శ్రీకాంత్‌ ఓ బ్యాంకుకు సంబంధించిన సంస్థలో 50 లక్షలకు బీమా చేయించాడు. ఆ తర్వాత అదే బ్యాంకులో భిక్షపతి పేరుతోనే 52 లక్షల లోన్‌ తీసుకుని ఓఇంటిని కొనుగోలు చేసి, నామినీగా తన పేరు పెట్టుకున్నాడు. అయితే, డబ్బు అవసరం పడి భిక్షపతి పేరు మీదున్న ఇంటిని అమ్మేయాలనుకున్నాడు శ్రీకాంత్. ఇందుకు భిక్షపతి ఒప్పుకోలేదు. దీంతో భిక్షపతిని చంపేస్తే లోన్ ఇన్సూరెన్స్ వస్తుందని భావించాడు శ్రీకాంత్.

ఈ విషయమై ఎస్‌ఓటీలో హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్న మోతీలాల్ ను సంప్రదించాడు. మరో ఇద్దరు నిందితులతో కలిసి 2021 డిసెంబర్ 22న భిక్షపతికి మద్యం తాగించి మర్డర్ చేశారు. మొగిలిగిద్ద దగ్గర భిక్షపతిని కారు దిగమని చెప్పి మొదట హాకీ స్టిక్ తో కొట్టారు. తర్వాత కారుతో ఢీకొట్టి చంపేశారు. అనంతరం భిక్షపతి పేరు మీదున్న ఇన్సూరెన్స్ డబ్బు కోసం దరఖాస్తు చేశాడు శ్రీకాంత్. భిక్షపతికి, శ్రీకాంత్ కు బంధుత్వం లేకపోవడంతో అనుమానించిన బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తమదైన స్టయిల్లో విచారించగా అసలు విషయం బయటపడింది. ఇన్సూరెన్స్ డబ్బులు శాంక్షన్ అయితే ముగ్గురు నిందితులకు 10లక్షలు చొప్పున ఇస్తానని ఒప్పందం చేసుకున్నాడు శ్రీకాంత్. టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా కేసుని ఛేదించిన పోలీసులు.. నిందితులను జైలుకు పంపించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..