
Komatireddy Rajagopal Reddy: తాను డబ్బులకు అమ్ముడుపోయే వ్యక్తిని కానని, నన్ను కొనే శక్తి ప్రపంచంలో పుట్టలేదని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ఆదివారం మునుగోడు బీజేపీ సమరభేరి సభలో ఆయన మాట్లాడారు. తాను తలదించుకునేది మునుగోడు ప్రజల కోసమేనని, ఎవరి కోసమే కాదని స్పష్టం చేశారు. తాను మాటకు కట్టుబడి ఉంటానని, అభివృద్ధి పేరుతోనే తాను రాజీనామా చేసి పార్టీ మారనని అన్నారు. ఎల్లప్పుడు కూడా మునుగోడు ప్రజల కోసమే కష్టడతానని రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు.
ఎన్నోసార్లు అపాయింట్‌మెంట్ అడిగినా సీఎం ఇవ్వలేదు:
తాను ఎన్నో సార్లు ముఖ్యమంత్రి కేసీఆర్ అపాయింట్‌మెంట్ అడిగినా ఇవ్వలేదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మునుగోడులో ఆయన టీఆర్‌ఎస్, కేసీఆర్‌పై మండిపడ్డారు. నన్ను నమ్ముకున్న ప్రజలకు న్యాయం చేయలేక రాజీనామా చేశానని పేర్కొన్నారు. ఉపఎన్నిక అనగానే సీఎం కేసీఆర్ మునుగోడుకు వచ్చారు. నా రాజీనామాతో ప్రభుత్వం దిగివచ్చిందన్నారు. మునుగోడు ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇవ్వాలని కోరారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి