Jagtial: వింతగా ప్రవర్తిస్తున్న టెన్త్ క్లాసు అమ్మాయిలు.. కౌన్సిలింగ్ చేయగా మైండ్ బ్లాంక్
ఓ అమ్మాయి వితంగా ప్రవర్తిస్తుండటంతో బాధితురాలి తండ్రి చైల్డ్ వెల్ఫేర్ కమిటీని ఆశ్రయించాడు. వారు అమ్మాయికి కౌన్సిలింగ్ నిర్వహించగా.. విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. రంగంలోకి దిగిన చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆఫీసర్లు బాధితురాలి నుంచి వివరాలు ఆరా తీయగా.. అదే స్కూల్లో ఆమెలాగే దాదాపు 15 మంది బాలికలు కూడా....

దిగ్భ్రాంతికర ఘటన ఇది. స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే మీ పిల్లల్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. లేదంటే.. దుర్మార్గుల కుటిల పన్నాగాలకు వారు బలయ్యే అవకాశం ఉంది. జగిత్యాల జిల్లాలో అలాంటి ఘటనే వెలుగుచూసింది. ఓ టెన్త్ క్లాస్ అమ్మాయి రోజూ వింతగా ప్రవర్తిస్తుంది. ఏదో మత్తులో ఉన్నట్లు తూలుతుంది. గమనించిన కుటుంబసభ్యులు అడిగితే.. ఏం లేదు అంతా నార్మలే అని చెబుతుంది. అనుమానం రావడంతో.. పేరెంట్స్… చైల్డ్ వెల్ఫేర్ కమిటీని ఆశ్రయించారు. వారు అమ్మాయికి కౌన్సిలింగ్ ఇస్తుండగా.. మైండ్ బ్లాంక్ అయ్యే విషయాలు వెలుగుచూశాయి.
జగిత్యాలలోని ఓ గవర్నమెంట్ స్కూల్లో బాలిక టెన్త్ క్లాస్ చదువుతోంది. ఆ బాలికను ట్రాప్ చేసిన ఓ గ్యాంగ్.. ఆమెకు గంజాయిని అలవాటు చేసారు. తొలుత గంజాయి చాక్లెట్లు అలవాటు చేశారు. అప్పటి నుంచి బాలిక ప్రవర్తనలో మార్పు మొదలైంది. ఆ తర్వాత ఆమెకు డ్రగ్స్ ఇవ్వడం కూడా స్టార్ట్ చేశారు. అనంతరం ఆ అమ్మాయికి గంజాయి ఆశచూపి.. రేవ్ పార్టీలకు, వ్యభిచారానికి తరలిస్తున్నారు. బాలికకు కౌన్సిలింగ్ ఇస్తుండగా.. ఈ విషయాలు తెలిశాయి. దీంతో తనను హోమ్ స్వధార్‌కు తరలించారు. బాధితురాలి నుంచి వివరాలు సేకరించిన చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అధికారులు ఇన్వెస్టిగేషన్ చేయగా.. అదే పాఠశాల్లో దాదాపు 15 మంది బాలికలు గంజాయికి అడిక్ట్ అయినట్లు గుర్తించారు. వారిని ట్రాప్ చేసి గంజాయికి బానిసలు చేసినట్లు గుర్తించారు. ఆ తర్వాత వారిని రేవ్ పార్టీలకు తీసుకెళ్లడం, వ్యభిచారం చేయించినట్లు వివరాలు సేకరించారు. రేవ్ పార్టీకి వచ్చే ప్రతి అమ్మాయికి గంజాయితో పాటు రూ.30 వేలు ఇస్తామని ఆశ చూపి వారిని.. హైదరాబాద్ శివారులో రేవ్ పార్టీలకు, వ్యభిచారానికి తరలించినట్లు గుర్తించారు.
బాలికలు చాలా వరకు పేద కుటుంబాలకు చెందినవారే. వారు ఇటీవల ప్రత్యేక తరగతుల పేరుతో వెళ్లి.. రెండ్రోజుల తర్వాత తిరిగిరావడంతో అనుమానం వచ్చి పేరెంట్స్ ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ప్రజంట్ పోలీసులు ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. త్వరలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) కూడా కేసును టేకప్ చేసే అవకాశాలు ఉన్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…




