AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: సరిహద్దులో టెన్షన్ టెన్షన్.. గోదావరి తీరం వెంట ఖాకీల డేగ కన్ను..!

ఒకవైపు ఎన్‌కౌంటర్ల పరంపర కొనసాగుతుంటే.. మరోవైపు తెలంగాణ చత్తీస్‌గడ్ రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో హై అలెర్ట్ కొనసాగుతోంది. మావోయిస్టులను మట్టుబెట్టేందుకు పోలీస్ బలగాలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.

Telangana: సరిహద్దులో టెన్షన్ టెన్షన్.. గోదావరి తీరం వెంట ఖాకీల డేగ కన్ను..!
Police Checking
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Jul 26, 2024 | 1:42 PM

Share

ఒకవైపు ఎన్‌కౌంటర్ల పరంపర కొనసాగుతుంటే.. మరోవైపు తెలంగాణ చత్తీస్‌గడ్ రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో హై అలెర్ట్ కొనసాగుతోంది. మావోయిస్టులను మట్టుబెట్టేందుకు పోలీస్ బలగాలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అయితే జూలై 28 నుండి మావోయిస్టు పార్టీ అమర వీరుల సంస్కరణ వారోత్సవాల నేపథ్యంలో మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు ముందస్తుగా అప్రమత్తం అయ్యారు. అడవులను జల్లెడ పడుతూ విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. మరోవైపు మావోయిస్టు పార్టీ కూడా అమరవీరుల వారోత్సవాలను విజయవంతం చేయాలని ఏజెన్సీ ప్రాంత ప్రజలకు పిలుపు నిచ్చింది..

జూలై 28 నుండి ఆగష్టు 3వ తేదీ వరకు జరుగనున్న మావోయిస్టు పార్టీ అమర వీరుల సంస్మరణ వారోత్సవాల నేపథ్యంలో ఏజెన్సీలో హై అలర్ట్ కొనసాగుతోంది. ఒకవైపు పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తుంటే, మరో వైపు మావోయిస్టులు లేఖలు విడుదల చేసి కాకరేపుతున్నారు. దీంతో తెలంగాణ – చత్తిస్‌గఢ్, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం నివురుగప్పిన నిప్పులా మారింది.

ప్రతియేట నిర్వహించే కార్యక్రమంలోనే భాగంగా జూలై 28 నుండి ఆగష్టు 3 వరకు జరిగే మావోయిస్టు పార్టీ అమర వీరుల వారోత్సవాలను విజయవంతం చేయాలని, పీడిత ప్రజలంతా ఈ ఉత్సవాలలో భాగస్వామ్యం కావాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఏజెన్సీ నీవురుగప్పిన నిప్పులా మారింది.. పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Police In Village

Police In Village

తెలంగాణ, చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. గోదావరి తీరం వెంట పోలీసుల నిఘా ముమ్మరం చేశారు. ములుగు జిల్లాలోని వాజేడు, వెంకటాపురం, ఏటూరునాగారం, ములుగు లో ముమ్మరం తనిఖీలు కొనసాగుతున్నాయి. మరోవైపు కాళేశ్వరం అంతర్ రాష్ట్ర వంతెన వద్ద విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. మావోయిస్టులు ఎలాంటి విధ్వంసానికి పాల్పడకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు.. గోదావరిలో ఇసుక ర్యాంపుల వద్ద ఉన్న వాహనాలు, వివిధ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్న వాహనాలను స్థానిక పోలీస్ స్టేషనులకు తరలించారు.

ఒకవైపు పోలీసుల తనిఖీలు, హై అలెర్ట్ కొనసాగుతుంటే మరోవైపు మావోయిస్టులు లేఖలు విడుదల చేసి సవాల్ విసిరారు.. మావోయిస్టు పార్టీ అమర వీరుల వారోత్సవాలను విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దీంతో ఉత్సవాల నేపథ్యంలో ఏం జరుగుతుందో అనే టెన్షన్ టెన్షన్ కొనసాగుతోంది.

వీడియో చూడండి….

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Follow Us
ధర్మాజీపేటలో వరుస ఆలయ దొంగతనాలు.. హుండీలు, ఆభరణాలు మాయం!
ధర్మాజీపేటలో వరుస ఆలయ దొంగతనాలు.. హుండీలు, ఆభరణాలు మాయం!
కొత్త కారు కొనాలనుకుంటే ఇదే బెస్ట్‌ ఆప్షన్‌!
కొత్త కారు కొనాలనుకుంటే ఇదే బెస్ట్‌ ఆప్షన్‌!
మాజీ ఆర్మీ జవాన్.. తాగుడు అతడ్ని ఇంతలా దిగజార్చింది..
మాజీ ఆర్మీ జవాన్.. తాగుడు అతడ్ని ఇంతలా దిగజార్చింది..
అందుకే జీవన్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడారు..మల్లు రవి కీలక వ్యాఖ్యలు
అందుకే జీవన్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడారు..మల్లు రవి కీలక వ్యాఖ్యలు
టేస్ట్.. డబుల్ ఎనర్జీ.. ఎవ్వరికీ తెలియని రాగి లడ్డు రెసిపీ ఇదే..
టేస్ట్.. డబుల్ ఎనర్జీ.. ఎవ్వరికీ తెలియని రాగి లడ్డు రెసిపీ ఇదే..
పిల్లలకు ఇస్తున్న క్రీమ్ బిస్కెట్లలో అసలు క్రీమ్ ఉందా?
పిల్లలకు ఇస్తున్న క్రీమ్ బిస్కెట్లలో అసలు క్రీమ్ ఉందా?
రంగు పోయిన రోల్డ్ గోల్డ్ నగలకు ఇంట్లోనే మెరుగు
రంగు పోయిన రోల్డ్ గోల్డ్ నగలకు ఇంట్లోనే మెరుగు
ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే బల్లులకు చుక్కలే.. ఇలా చేస్తే ఒక్కటి కూడా
ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే బల్లులకు చుక్కలే.. ఇలా చేస్తే ఒక్కటి కూడా
పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం సూపర్ న్యూస్.. దేశంలో ఎక్కడైనా..
పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం సూపర్ న్యూస్.. దేశంలో ఎక్కడైనా..
ఐపీఎల్ లో వైభవ్ సూర్యవంశీ సంచలన రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్
ఐపీఎల్ లో వైభవ్ సూర్యవంశీ సంచలన రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్