Telangana Cancer: తెలంగాణలో పెరుగుతున్న క్యాన్సర్‌ కేసులు.. మూడేళ్లలో మరింత పెరిగే అవకాశం

|

Feb 04, 2022 | 12:01 PM

Telangana Cancer: క్యాన్సర్‌ బారిన పడేవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. జీవనశైలి మార్పులు, ఆహారపు అలవాట్లు తదితర కారణాల..

Telangana Cancer: తెలంగాణలో పెరుగుతున్న క్యాన్సర్‌ కేసులు.. మూడేళ్లలో మరింత పెరిగే అవకాశం
Follow us on

Telangana Cancer: క్యాన్సర్‌ బారిన పడేవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. జీవనశైలి మార్పులు, ఆహారపు అలవాట్లు తదితర కారణాల వల్ల ఈ వ్యాధి బారిన పడేవారి సంఖ్య ఎక్కువైపోతోంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా క్యాన్సరర్‌ ముప్పు వేగంగా పెరిగిపోతోంది. 2025 నాటికి 53వేల కొత్త క్యాన్సర్‌ కేసులు నమోదయ్యే అవకాశం ఉందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ ఇన్ఫర్మేటిక్ (NCDIR) వెల్లడించింది. ఎన్‌సీడీఐఆర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. 2020లో తెలంగాణ రాష్ట్రంలో 47,620 కేన్సర్ కేసులు నమోదైనట్టు తెలిపింది. వచ్చే మూడేళ్లలో 12.48 శాతం క్యాన్సర్‌ కేసులు పెరిగే అవకాశం ఉందంటున్నారు.

ఈ క్యాన్సర్లు అధికం:

రాష్ట్రంలో బ్రెస్ట్, లంగ్, హెడ్, నెక్, సర్విక్స్, స్టమక్ కేన్సర్ కేసులు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. అయితే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో హెడ్‌ , నెక్‌ క్యాన్సర్‌ కేసులు అధికంగా ఉన్నాయి. ప్రస్తుతమున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా క్యాన్సర్‌ బారిన పడేవారి సంఖ్య పెరిగిపోతోందని తెలిపారు.

పొగాకును ఇష్టానుసారంగా వినియోగించడం..

క్యాన్సర్‌కు ముఖ్యంగా పొగాకును ఎక్కువగా వినియోగించడం. ఇష్టానుసారంగా పొగాకు హెడ్‌, నెక్‌ క్యాన్సర్లకు ప్రధాన కారణమని చెబుతున్నారు. ప్రతి 10 క్యాన్సర్‌ రోగుల్లో 6-7 మందికి ఈ అలవాటు ఉంటుందని హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఆంకాలజీ డైరెక్టర్‌ తెలిపారు. కాలుష్యం కూడా కారణమంటున్నారు. తెలంగాణలో3,800 వార్షిక సగటు క్యాన్సర్‌ కేసులు నమోదు అవుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. రాష్ట్రంలో 2025 నాటికి కేసులు మరింతగా పెరిగే అవకాశం ఉంది. 74ఏళ్ల లోపు వయసున్న ప్రతి ఏడుగురు మహిళల్లో ఒకరు, ప్రతి తొమ్మిది మంది పురుషుల్లో ఒకరు క్యాన్సర్‌ బారిన పడే ప్రమాదం ఉందంటున్నారు. క్యాన్సర్‌ కేసులు పెరగడానికి అపరిశుభ్రత, ఆహారపు అలవాట్లు,

అయితే క్యాన్సర్‌ను మొదట్లోనే గుర్తించినట్లయితే పూర్తి స్థాయిలో నయం చేసుకునే అవకాశం ఉంటుందని, ప్రమాద స్టేజీ పెరిగిన తర్వాత ఏమి చేయలేమని వైద్య నిపుణులు వివరిస్తున్నారు.

మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌, కర్ణాటక వంటి ఇతర రాష్ట్రాలు కూడా క్యాన్సర్‌ కేసుల సంఖ్య 12 శాతం పెరిగే అవకాశం ఉందని, మధ్యప్రదేశ్‌లో 17 శాతం పెరిగే అవకాశం ఉందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ ఇన్ఫర్మేటిక్ (ఎన్‌సీడీఐఆర్‌) తెలిపింది.

ఇవి కూడా చదవండి:

Adulteration testing: మీరు కొనుగోలు చేసే కూరగాయలు మంచివేనా.. ఎలా గుర్తించాలంటే..

Tree Species: ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని జాతుల చెట్టు ఉన్నాయో తెలుసా..? పరిశోధనలలో ఆశ్చర్యపోయే నిజాలు..!