Telangana Weather Report: తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు.. అలర్ట్ అయిన అధికారయంత్రాంగం..

Telangana Weather Report: గులాబ్ తుపాను ఎఫెక్ట్‌తో తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ, రేపు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు.

Telangana Weather Report: తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు.. అలర్ట్ అయిన అధికారయంత్రాంగం..
Skymet Weather

Updated on: Sep 28, 2021 | 11:59 AM

Telangana Weather Report: గులాబ్ తుపాను ఎఫెక్ట్‌తో తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ, రేపు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. హైదరాబాద్ సహా పలు జిల్లా్ల్లో కుండపోత వర్షాలు కురుస్తాయని తెలిపారు. ప్రస్తుతం తుపాను ప్రభావం తగ్గిపోతున్నప్పటికీ.. దీని ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఇకపోతే.. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందన్నారు. దీని ప్రభాంతోనూ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. ఇదిలాఉంటే.. ‘గులాబ్’ తుపాను కారణంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురిశాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా నైరుతి సీజన్‌లో అత్యధికంగా 95.70 సెంటీమీటర్ల వర్షపాతు నమోదైందని అధికారులు వెల్లడించారు.

ఐదు జిల్లాల్లో అత్యధిక వర్షపాతం, 21 జిల్లాల్లో అధిక వర్షపాతం, 7 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైందన్నారు. కాగా, భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. అవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దన్నారు. ఒకవేళ వెళ్లినా.. ప్రతీ జాగ్రత్తగా చూసుకుని వెళ్లాలని సూచించారు. ఇక భారీ వర్షాల నేపథ్యంలో.. పోలీసులు, రెవెన్యూ, ఇతర ప్రభుత్వ సిబ్బందిని ప్రభుత్వం అప్రమత్తం చేసింది. అన్ని శాఖలు సమన్వయం చేసుకుని ప్రజలకు ఇబ్బంది కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతీ జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్‌ ఏర్పాటు చేశారు. ప్రజలు ఎవరైనా సమస్యలు ఎదురైతే వెంటనే కంట్రోల్ రూమ్ నెంబర్లకు ఫోన్ చేయాల్సిందిగా అధికారులు సూచిస్తున్నారు.

Also read:

Virat Kohli: స్విమింగ్ ఫుల్‎లో ఆర్సీబీ ఆటగాళ్లు.. వైరల్‎గా మారిన విరాట్ ఫొటోలు

Huzurabad By Election: హుజూరాబాద్‌ నగారా మోగింది.. అంతా రెడీ.. ఏ పార్టీ అభ్యర్థులు ఎవరంటే..

David Warner: సన్‌రైజర్స్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్ జట్టుకు డేవిడ్ భాయ్ గుడ్ బై.?