Weather Forecast: 3 రోజులు దంచుడే.. తెలంగాణలోని ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్.. వడగండ్లు పడే ఛాన్స్..

|

Apr 14, 2023 | 8:26 PM

Weather Forecast: తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఆయా జిల్లాల్లో భారీ వర్షంతో పాటు, వడగండ్లు పడే అవకాశం ఉందని పేర్కొంది. తూర్పు విదర్భ నుంచి ఉత్తర కోస్తా కర్ణాటక వరకు ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. దీని ప్రభావతంతో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. ముఖ్యంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని..

Weather Forecast: 3 రోజులు దంచుడే.. తెలంగాణలోని ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్.. వడగండ్లు పడే ఛాన్స్..
Telangana Weather Forecast
Follow us on

తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఆయా జిల్లాల్లో భారీ వర్షంతో పాటు, వడగండ్లు పడే అవకాశం ఉందని పేర్కొంది. తూర్పు విదర్భ నుంచి ఉత్తర కోస్తా కర్ణాటక వరకు ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. దీని ప్రభావతంతో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. ముఖ్యంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం.

వాతావరణ కేంద్రం ప్రకటించిన వివరాల ప్రకారం..

వికారాబాద్‌

రంగారెడ్డి

ఇవి కూడా చదవండి

సిద్దిపేట

సంగారెడ్డి

మెదక్‌

కామారెడ్డి

మహబూబ్‌నగర్‌

ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ అయ్యాయ్యి.

ఇక ద్రోణి ప్రభావతంతో ఆయా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందన్నారు. పలు చోట్ల వడగండ్లు సైతం పడే అవకాశం ఉందన్నారు. అదే సమయంలో మరికొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయని, పొడి వాతావరణం ఉంటుందని పేర్కొంది వాతగావరణ శాఖ. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో పగటిపూట ఉష్ణోగ్రతలు 34-38 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు అయ్యే ఛాన్స్ ఉందని వాతవరణ శాఖ ప్రకటించింది. అదే సమయంలో హైదరాబాద్‌లోనూ పలు చోట్ల వర్షం ప్రభావం ఉండొచ్చని పేర్కొంది. మరికొన్ని జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 41 నుంచి 43 డిగ్రీల వరకు ఉంటుందని అంచనా వేసింది వాతావరణ కేంద్రం. దాదాపు 3 రోజుల పాటు రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఉంటుందని పేర్కొన్నారు.

Imd Report

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..