Telangana Heat Waves: హైదరాబాద్‌లో భిన్న వాతావరణం.. ఓ వైపు గరిష్ట ఉష్ణోగ్రత.. మరోవైపు పలు ప్రాంతాల్లో వర్షాలు..

|

Jun 03, 2023 | 9:25 AM

ఎండ వేడికి జడిసి ప్రజలు  ఇంట్లోనే ఉండడానికి ఆసక్తిని చూపించారు. దీంతో నగరంలోని అనేక ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి. ముఖ్యంగా సాయంత్రం 4 గంటల సమయంలో 43 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత గరిష్ట స్థాయికి చేరుకుందని తెలుస్తోంది. 

Telangana Heat Waves: హైదరాబాద్‌లో భిన్న వాతావరణం.. ఓ వైపు గరిష్ట ఉష్ణోగ్రత.. మరోవైపు పలు ప్రాంతాల్లో వర్షాలు..
Summer Hot Waves
Follow us on

వేసవి కాలంలో భిన్న వాతావరణం చోటు చేసుకుంది. ఓ వైపు అకాల వర్షాలు కురుస్తున్నాయి.. మరోవైపు ఎండలు మండిస్తున్నాయి. రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. హైదరాబాద్‌లోని అనేక ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రత అత్యధికంగా నమోదవుతుంది. గరిష్ట పగటి ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల సెల్సియస్ నుంచి 43 డిగ్రీల సెల్సియస్ మధ్య స్థిరంగా ఉంది.

శుక్రవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రభుత్వ సెలవుదినం కారణంగా పాఠశాలలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల సహా శుక్రవారం మూసివేశారు. ఎండ వేడికి జడిసి ప్రజలు  ఇంట్లోనే ఉండడానికి ఆసక్తిని చూపించారు. దీంతో నగరంలోని అనేక ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి. ముఖ్యంగా సాయంత్రం 4 గంటల సమయంలో 43 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత గరిష్ట స్థాయికి చేరుకుందని తెలుస్తోంది.

నగరంలో ఖైరతాబాద్, సెరిలింగంపల్లి, గచ్చిబౌలి పరిధిలోని ప్రాంతాల్లో గరిష్టంగా 43 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదు కాగా, ఆ తర్వాత చార్మినార్‌, రామచంద్రపురం (బీహెచ్‌ఈఎల్‌ ఏరియా)లలో గరిష్ట ఉష్ణోగ్రత 41.8 డిగ్రీల సెల్సియస్‌ నుంచి 41.6 డిగ్రీల సెల్సియస్‌ మధ్య నమోదైంది.

ఇవి కూడా చదవండి

రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఉష్ణోగ్రతలు అధిక స్తాయిలో నమోదవుతున్నాయి. నల్గొండలో గరిష్టంగా 46.8 డిగ్రీల సెల్సియస్, ఖమ్మంలో 46.6 డిగ్రీల సెల్సియస్, పెద్దపల్లిలో 46.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ నుంచి 46 డిగ్రీల సెల్సియస్ మధ్య స్థిరంగా నమోదయ్యాయి.

రాబోయే కొద్ది రోజుల పాటు తెలంగాణలో విపరీతమైన వేడి కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. మరోవైపు హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. తెలంగాణలో నైరుతి రుతుపవనాలు ప్రారంభమయ్యి జూన్ 14 వరకు కొనసాగుతాయని అంచనా వేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి..