Telangana: చలానాల భారం పడలేక నడి రోడ్డుపై బైక్ తగలబెట్టాడు…

| Edited By: Anil kumar poka

Nov 27, 2021 | 6:35 PM

ఓ వైపు పెట్రోల్‌ మోత మోగిపోతుంది. బంక్ వైపు చూడాలంటేనే భయమేస్తుంది. 100 దాటిన పెట్రోల్ ధరతో సామాన్యులు అల్లాడిపోతున్నారు.

Telangana: చలానాల భారం పడలేక నడి రోడ్డుపై బైక్ తగలబెట్టాడు...
Bike Burnt
Follow us on

ఓ వైపు పెట్రోల్‌ మోత మోగిపోతుంది. బంక్ వైపు చూడాలంటేనే భయమేస్తుంది. 100 దాటిన పెట్రోల్ ధరతో సామాన్యులు అల్లాడిపోతున్నారు. పెట్రోల్ ధరలు ఇలా ఉంటే.., మరోవైపు ట్రాఫిక్‌ చాలనాలతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. భారీ ఫైన్స్‌తో అల్లాడిస్తున్నారు పోలీసులు. వాహనాలతో బయటకు వెళ్తే.. ఏ రూల్ కింద ఎంత చెల్లించాల్సి వస్తుందో అని భయపడుతున్నారు. అయితే, ఆదిలాబాద్‌ జిల్లాలో ఓ వ్యక్తి పోలీసులకే షాకిచ్చాడు. ట్రాఫిక్ చలానా చెల్లించమన్నారనే ఆగ్రహంతో తన బైకును తగలబెట్టేసి నిరసన వ్యక్తం చేశాడు.

వివరాల్లోకి వెళ్తే.. ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రానికి చెందిన మక్బూల్ అనే వ్యక్తి తన ద్విచ్రవాహనానికి నిప్పంటించాడు. ఇప్పటికే వాహనంపై రెండు వేల రూపాయల జరిమానా చెల్లించానని.. ఇంకా చెల్లించాలంటూ పోలీసులు ఇబ్బందిని పెడుతున్నారని అతడు చెప్పుకొచ్చాడు. దీంతో చలానాల భారం భరించలేక పంజాబ్ చౌక్ లో తన వాహనాన్ని తగలబెట్టినట్లు వెల్లడించాడు. ఈ క్రమంలో పోలీసులు, స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే బైక్ చాలా భాగం కాలిపోయింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

 

Also Read: అధిక వడ్డీ ఆశ.. కి’లేడీ’ ట్రాప్‌లో సినిమా స్టార్స్

Ramagundam: సంచలనం.. రోడ్డు పక్కన వ్యక్తి తల, రెండు వేర్వేరు చేతులు.