TSPSC Paper Leak Case: టీఎస్పీఎస్సీ పేపర్‌ లీక్‌ కేసులో మరో బిగ్‌ ట్విస్ట్.. ఎంపీడీవో అధికారి, అతని తమ్ముడు అరెస్ట్‌

|

May 05, 2023 | 11:53 AM

టీఎస్పీఎస్సీ కేసులో మరో ఇద్దరు అరెస్టయ్యారు. దీంతో ఈ కేసులో అరెస్టైన నిందితుల సంఖ్య 22 కు చేరింది. వికారాబాద్‌ ఎంపీడీవో కార్యాలయంలో పనిచేస్తున్న భగవంత్ కుమార్ డాక్య నుంచి ఏఈ పేపర్‌ను కొనుగోలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. భగవంత్ కుమార్ తన తమ్ముడు రవికుమార్ కోసం..

TSPSC Paper Leak Case: టీఎస్పీఎస్సీ పేపర్‌ లీక్‌ కేసులో మరో బిగ్‌ ట్విస్ట్.. ఎంపీడీవో అధికారి, అతని తమ్ముడు అరెస్ట్‌
TSPSC paper leak case
Follow us on

టీఎస్పీఎస్సీ కేసులో మరో ఇద్దరు అరెస్టయ్యారు. దీంతో ఈ కేసులో అరెస్టైన నిందితుల సంఖ్య 22 కు చేరింది. వికారాబాద్‌ ఎంపీడీవో కార్యాలయంలో పనిచేస్తున్న భగవంత్ కుమార్ డాక్య నుంచి ఏఈ పేపర్‌ను కొనుగోలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. భగవంత్ కుమార్ తన తమ్ముడు రవికుమార్ కోసం ఏఈ పేపర్ కొన్నట్లు దర్యాప్తులో తేలింది. రవికుమార్ ఏఈ ఎగ్జామ్ రాశాడు. దీంతో పోలీసులు భగవంత్ కుమార్, రవికుమార్ ఇద్దరినీ సిట్‌ అధికారులు అరెస్టు చేశారు.

భగవంత్ కుమార్‌కు పేపర్ అమ్మకానికి డాక్య నాయక్ 2 లక్షలకు బేరం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. దీంతో సిట్ అధికారులు డాక్యా నాయక్ బ్యాంక్ లావాదేవీలు పరిశీలించారు. అనుమస్పద లావాదేవీ గా 1.75 లక్షలను సిట్ గుర్తించింది. ఈ మొత్తం సొమ్మ భగవంత్ కుమార్ నుంచి డిపాజిట్ అయినట్టు సిట్ గుర్తించింది. దీనిపై సిట్‌ అధికారులు భగవంత్ రావ్‌ను విచారించగా తన తమ్ముడు రవికుమార్ కోసం పేపర్ కొన్నట్టు అంగీకరించాడు. దీంతో పేపర్ లీక్ నిందితుల సంఖ్య 22కు చేరింది. కాగా టీఎస్పీయస్సీ పేపర్ లీక్‌ వ్యవహారం మార్చి 12న వెలుగులోకొచ్చింది. దీంతో గ్రూప్‌1తోపాటు పలు పరీక్షలను కమిషన్‌ రద్దు చేసింది. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో నిందితులకు రూ.33.4 లక్షలు అందినట్లు సిట్‌ అధికారులు గుర్తించారు

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.