
పంట రక్షణకోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు యమ పాశం అయ్యాయి. ఇద్దరు రైతులు మృత్యువాత పడ్డారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం గోవింద్ పూర్ లో విషాదం చోటు చేసుకుంది. అడవి పందుల నుంచి పంట రక్షణ కోసం పొలం చుట్టూ ఇనుప తీగ వేసి విద్యుత్ కనెక్షన్ ఇస్తుండగా విద్యుదాఘాతంతో ఇద్దరు అన్నదమ్ములకు చెందారు. గోవింద్ పూర్ కు చెందిన ఎరుకల జగన్ (48), ఎరుకల మల్లేశం(44) వ్యవసాయంతోపాటు తాపీ మేస్త్రీలుగా పని చేస్తూ జీవిస్తున్నారు. పొలంలో చెరకు, ఇతర పంటలను అడవి పందులు తరచూ ధ్వంసం చేస్తున్నాయి. పంటలను కాపాడుకునేందుకు గురువారం రాత్రి ఇద్దరూ పొలానికి వెళ్లి చుట్టూ ఇనుప తీగ ఏర్పాటు చేశారు. పొలం మీదుగా వెళు తున్న 32/11 కేవీ విద్యుత్తు తీగల నుంచి ఇనుప కంచెకు కనెక్షన్ ఇచ్చేందుకు యత్నిస్తుండగా ఇద్దరూ విద్యుదాఘాతానికి గురయ్యారు. జగన్, మల్లేశం పొలంలోనే ప్రాణాలు విడిచారు. అటుగా వెళ్లిన రైతులు ప్రమాదాన్ని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..