హైదరాబాద్, జూలై 19: సిటీ బస్సులో చిల్లర సమస్యకు చెక్ పెట్టేందుకు టీఎస్‌ఆర్టీసీ మరో కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. టికెట్ల కొనుగోలుకు క్యూఆర్ కోడ్ స్కాన్ సిస్టం తీసుకురానుంది. కండక్టర్‌కు డబ్బు చెల్లించకుండా బస్సులోని ప్రయాణికులు క్యూఆర్ కోడ్ ద్వారా నేరుగా చెల్లించి టికెట్ కొనుగోలు చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించింది ఇప్పటికే ఆర్టీసీ సాంకేతిక విభాగం కసరత్తు పూర్తి చేసింది. నగదు రహిత టికెట్ కొనుగోలు పద్ధతిని ప్రవేశపెట్టాలని గత ఏడాది చివరలోనే టీఎస్‌ఆర్టీసీ భావించినప్పటికీ సాంకేతిక కారణాల వల్ల అది అమలుకు నోచుకోలేదు.
ఐతే ఏదైనా కారణం వల్ల డబ్బులు జమకాకపోతే ఆ డబ్బులకు ఎవరు బాధ్యత వహించాలి, క్యూఆర్ కోడ్ ద్వారా జమ అయిన నగదు ఎవరి ఖాతాలో జమ చేయబడతాయి భావించారు. కొత్త సాఫ్ట్‌వేర్‌ను రూపొందించిన తర్వాత ప్రయోగాత్మకంగా తొలుత సిటీ బస్సుల్లో అమలు చేసేందుకు ఆర్టీసీ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇది విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో నగదు రహిత టికెట్లు చలామణిలోకి రానున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.