నాగార్జున సాగర్‎లో పర్యాటకులకు తప్పని నిరాశ.. ఎందుకంటే..

నాగార్జునసాగర్‌లో కృష్ణానది హోయలను చూసేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. దీంతో సాగర్‌ పరిసరాలన్నీ కిటకిటలాడాయి. ఎన్నో ఆశలతో ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్‎కు వచ్చిన పర్యాటకులకు మాత్రం నిరాశ ఎదురైంది.

నాగార్జున సాగర్‎లో పర్యాటకులకు తప్పని నిరాశ.. ఎందుకంటే..
Nagarjuna Sagar
Follow us

| Edited By: Srikar T

Updated on: Aug 11, 2024 | 3:30 PM

నాగార్జునసాగర్‌లో కృష్ణానది హోయలను చూసేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. దీంతో సాగర్‌ పరిసరాలన్నీ కిటకిటలాడాయి. ఎన్నో ఆశలతో ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్‎కు వచ్చిన పర్యాటకులకు మాత్రం నిరాశ ఎదురైంది. నాగార్జునసాగర్‌ జలాశయం నిండుకుండలా మారి కొత్త అందాలను సంతరించుకుంది. వారం రోజులుగా ప్రాజెక్టు క్రస్ట్‌గేట్ల నుంచి దిగువకు నీటి విడుదల కొనసాగుతోంది. వరుస సెలవులు కావడంతో కృష్ణమ్మ పరవళ్ళను చూసేందుకు పర్యాటకులు నాగార్జునసాగర్‎కు తరలివస్తున్నారు. సాగర్ వద్దకు వచ్చిన ప్రతి పర్యాటకుడు కృష్ణమ్మ అలలపై లాంచీ ప్రయాణం చేసి మధురమైన అనుభూతి పొందుతుంటారు. నాగార్జునసాగర్ నుండి నాగార్జున కొండకు పర్యాటకులను తీసుకువెళ్లే తెలంగాణ టూరిజం శాఖ లాంచీలను నిలిపి వేసింది. దీంతో సాగర్ సందర్శనకు వచ్చిన పర్యాటకులు నాగార్జున కొండను సందర్శించే అవకాశం లేకుండా పోయింది. కనీసం జాలీ ట్రిప్పులో సాగర్ జలాశయంలో విహరించే అవకాశం లేక నిరాశకు గురయ్యారు.

విజయ విహార్‌ నుంచి లాంచీస్టేషన్‌ను నాలుగు రోజుల క్రితం డౌన్‌ పార్కు వద్దకు మార్చారు. రెండు రోజుల పాటు నాగార్జునకొండ, రిజర్వాయర్‎లో జాలీ ట్రిప్పులను నిర్వహించింది. ఏమైందో ఏమో కానీ తెలంగాణ టూరిజం నుండి ఒక్కసారిగా లాంచీల రాకపోకలు నిలిచి పోయాయి. సాగర్ డ్యాం జల విన్యాసాలను చూసిన సందర్శకులు లాంచీలో విహరిద్దామని గంటల తరబడి బోటింగ్ పాయింట్ వద్ద ఎదురు చూశారు. అయితే సాగర్‎కు వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో పర్యాటకుల భద్రత దృష్ట్యా నాగార్జున కొండ, జాలీ ట్రిప్పులను నిలిపి వేయాలని అధికారులు ఆదేశించినట్టు లాంచి స్టేషన్ సిబ్బంది చెబుతున్నారు. దీంతో పర్యాటకులు నిరాశతో వెనుదిరిగారు.

రూ.లక్షల్లో ఆదాయం కోల్పోతున్న తెలంగాణ పర్యాటక సంస్థ

ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్‎కు సాధారణ రోజుల కంటే రిజర్వాయర్ పూర్తిగా నిండిన సమయంలోనే పర్యాటకులు భారీగా తరలివస్తుంటారు. సాగర్‎కు వచ్చిన ప్రతి పర్యాటకుడు.. సాగర్ జలాలపై లాంచీ విహారానికి ఇష్టపడుతుంటారు. దీంతో కొన్ని వందల మంది పర్యాటకుల కోసం నాగార్జునకొండ, జాలీ ట్రిప్పులకు తెలంగాణ పర్యాటక శాఖ లాంచీలను నడుపుతోంది. దీంతో సాధారణ రోజుల కంటే సాగర్ నిండిన సమయంలో లాంచి స్టేషన్ కు భారీగా ఆదాయం సమకూరుతోంది. రెండు రోజులుగా తెలంగాణ వైపు నుంచి నాగార్జునకొండ, జాలీ ట్రిప్పులకు లాంచీలను నిలిపియడంతో భారీగా ఆదాయాన్ని కోల్పోతోంది తెలంగాణ టూరిజం శాఖ.

ఏపీ వైపు నుంచి నడుస్తున్న లాంచీలు..

సాగర్ జలాశయంలో తెలంగాణ టూరిజం లాంచీల రాకపోకలు నిలిపివేసినా ఏపీ నుండి లాంచీలను నాగార్జున కొండకు యధావిధిగా నడుపుతోంది. ఆంధ్రా వైపు లాంచీలకు లేని వరద ప్రమాదం తెలంగాణకే ఉంటుందా అని పర్యాటకులు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ టూరిజం లాంచీలను అందుబాటులోకి తీసుకురాకపోవడంతో సంబంధిత అధికారులపై పర్యాటకులు ఆగ్రహం, అసహనం వ్యక్తం చేస్తూ నిరాశతో వెనుదిరిగారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

దేశం కోసం రెండు ప్రభుత్వ ఉద్యోగాలను వదులుకున్న ఒలింపిక్ విజేత
దేశం కోసం రెండు ప్రభుత్వ ఉద్యోగాలను వదులుకున్న ఒలింపిక్ విజేత
సమాజానికి ఏం సందేశమిస్తున్నారు? స్టార్ హీరోలపై శక్తిమాన్ ఫైర్
సమాజానికి ఏం సందేశమిస్తున్నారు? స్టార్ హీరోలపై శక్తిమాన్ ఫైర్
చైతూ- శోభితల ప్రేమ కథ మొదలైందిలా.. సీక్రెట్స్ బయట పెట్టేసిన సమంత
చైతూ- శోభితల ప్రేమ కథ మొదలైందిలా.. సీక్రెట్స్ బయట పెట్టేసిన సమంత
కుటుంబ సభ్యుల కోసం కొత్త లగ్జరీ కారు కొన్న సిరాజ్.. ధర ఎంతంటే?
కుటుంబ సభ్యుల కోసం కొత్త లగ్జరీ కారు కొన్న సిరాజ్.. ధర ఎంతంటే?
ఆన్‌లైన్‌లోనూ ఎల్ఐసీ సేవలు షురూ.. స్టేటస్ తెలుసుకోవడం చాలా ఈజీ
ఆన్‌లైన్‌లోనూ ఎల్ఐసీ సేవలు షురూ.. స్టేటస్ తెలుసుకోవడం చాలా ఈజీ
పవన్ కల్యాణ్ చెప్పిన కుంకీ ఏనుగుల స్పెషల్ ఇదే.! వీడియో..
పవన్ కల్యాణ్ చెప్పిన కుంకీ ఏనుగుల స్పెషల్ ఇదే.! వీడియో..
మ‌ళ్లీ బంగ్లాదేశ్‌కు షేక్ హ‌సీనా.? షేక్‌ హసీనా కుమారుడు వ్యాఖ్యలు
మ‌ళ్లీ బంగ్లాదేశ్‌కు షేక్ హ‌సీనా.? షేక్‌ హసీనా కుమారుడు వ్యాఖ్యలు
రెండు ఓటీటీల్లోకి ధనుష్ రాయన్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
రెండు ఓటీటీల్లోకి ధనుష్ రాయన్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
రెండు రూపాయలకే బిర్యానీ ఎగబడిన జనం.. ట్రాఫిక్‌ జాం.!
రెండు రూపాయలకే బిర్యానీ ఎగబడిన జనం.. ట్రాఫిక్‌ జాం.!
సీఎన్జీ కార్లలో బెస్ట్ ఇదేనా.? ఆ మూడు కార్ల మధ్య తేడాలు ఏంటంటే..?
సీఎన్జీ కార్లలో బెస్ట్ ఇదేనా.? ఆ మూడు కార్ల మధ్య తేడాలు ఏంటంటే..?
పవన్ కల్యాణ్ చెప్పిన కుంకీ ఏనుగుల స్పెషల్ ఇదే.! వీడియో..
పవన్ కల్యాణ్ చెప్పిన కుంకీ ఏనుగుల స్పెషల్ ఇదే.! వీడియో..
మ‌ళ్లీ బంగ్లాదేశ్‌కు షేక్ హ‌సీనా.? షేక్‌ హసీనా కుమారుడు వ్యాఖ్యలు
మ‌ళ్లీ బంగ్లాదేశ్‌కు షేక్ హ‌సీనా.? షేక్‌ హసీనా కుమారుడు వ్యాఖ్యలు
రెండు రూపాయలకే బిర్యానీ ఎగబడిన జనం.. ట్రాఫిక్‌ జాం.!
రెండు రూపాయలకే బిర్యానీ ఎగబడిన జనం.. ట్రాఫిక్‌ జాం.!
పల్నాడు జిల్లా డంపింగ్‌యార్డ్‌లో మొసళ్ల కలకలం.. వీడియో.
పల్నాడు జిల్లా డంపింగ్‌యార్డ్‌లో మొసళ్ల కలకలం.. వీడియో.
సుబ్రమణ్యస్వామికి కావడి చెల్లించిన మాజీ మంత్రి రోజా
సుబ్రమణ్యస్వామికి కావడి చెల్లించిన మాజీ మంత్రి రోజా
భారత్‌లో ఆశ్రయం కోసం పోటెత్తుతోన్న బంగ్లాదేశీయులు..
భారత్‌లో ఆశ్రయం కోసం పోటెత్తుతోన్న బంగ్లాదేశీయులు..
మరికాసేపట్లో పెళ్లి.. ఎదురుగా కనిపించిన సీన్‌ చూసి వరుడు షాక్‌.!
మరికాసేపట్లో పెళ్లి.. ఎదురుగా కనిపించిన సీన్‌ చూసి వరుడు షాక్‌.!
సొంత కారును.. అంబులెన్స్‌గా మార్చేసిన టీడీపీ ఎమ్మెల్యే
సొంత కారును.. అంబులెన్స్‌గా మార్చేసిన టీడీపీ ఎమ్మెల్యే
కోర్టులో కేసు వేసిన దెయ్యం.? పోలీసులు, లాయర్లు అంతా పరేషాన్‌.!
కోర్టులో కేసు వేసిన దెయ్యం.? పోలీసులు, లాయర్లు అంతా పరేషాన్‌.!
అలెర్ట్ హైదరాబాద్.! ఐదు రాష్ట్రాల సరిహద్దుల్లో బంగ్లాదేశీయులు..
అలెర్ట్ హైదరాబాద్.! ఐదు రాష్ట్రాల సరిహద్దుల్లో బంగ్లాదేశీయులు..