Telangana: 57 ఏళ్లు నిండిన వారికి అలెర్ట్.. నెలాఖరు వరకు వృద్ధాప్య పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ

|

Aug 14, 2021 | 2:43 PM

57 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పింఛన్లపై  గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నెలాఖరు వరకు వృద్ధాప్య...

Telangana: 57 ఏళ్లు నిండిన వారికి అలెర్ట్.. నెలాఖరు వరకు వృద్ధాప్య పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ
Telangana Pension
Follow us on

వృద్ధాప్య పింఛన్ల కనీస అర్హత వయస్సును 57 ఏళ్లకు తగ్గించిన నేపథ్యంలో అర్హులను గుర్తించి వీలైనంత త్వరగా పింఛన్లు మంజూరు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల ఆదేశించింది. ఈ మేరకు గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నెలాఖరు వరకు వృద్ధాప్య పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని పేర్కొంది. మీ-సేవా, ఈ-సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని తెలిపింది. నిర్ణీత నమానాలోని దరఖాస్తు పత్రంలో పేరు, వివరాలు, ఆధార్ సంఖ్య, అందులోని పుట్టినతేదీ, బ్యాంకు ఖాతా వివరాలు, మొబైల్ నంబర్ పేర్కొనాలి.  దరఖాస్తులో వివరాలతో పాటు ఫొటో, ఆధార్‌కార్డు కాపీ తప్పనిసరి అని తెలిపింది. పింఛను దరఖాస్తుల కోసం సర్వీస్ రుసుం వసూలు చేయొద్దని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు మీ-సేవా, ఈ-సేవా కేంద్రాలకు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో 2018ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్ధానం మేరకు 57 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పింఛన్ ఇవ్వాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. వృద్ధాప్య పింఛన్ల వయోపరిమితి 65 సంవత్సరాలు ఉండగా, 57 ఏళ్లకు తగ్గించిన విషయం తెలిసిందే. కుటుంబంలో ఒక్కరికే పెన్షన్ పద్దతిని కొనసాగించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. భర్త చనిపోతే భార్యకు, భార్య చనిపోతే భర్తకు వెంటనే ఫించన్ బదిలీ చేయాలని ఆదేశించారు. అయితే, ఆసరా పింఛన్ల నిబంధనలు యథాతథంగా కొనసాగుతాయి.

నిబంధనలు:

  • 57 ఏళ్లు నిండినవారు ఆసరాకు అర్హులు(1953–1961 మధ్య జన్మించిన వారై ఉండాలి)
  • తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు మాత్రమే అర్హులు
  •  ఓటర్‌ కార్డుపై సూచించే పుట్టిన తేదీ వివరాల ఆధారంగా వయసు నిర్ధారణ
  • దరఖాస్తుదారుల పేరుపై మెట్టభూమి 7.5 ఎకరాలు, మాగాణికి 3 ఎకరాలకు మించి ఉండరాదు
  • దరఖాస్తుదారుడి కుటుంబ వార్షికాదాయం గ్రామాల్లో రూ.1.5 లక్షలు, నగరాల్లో రూ.2లక్షలు పరిమితి దాటరాదు.
  • దరఖాస్తుదారులకు ఎక్కువ ఇన్‌కమ్ వచ్చే వ్యాపారాలు ఉండరాదు
  • విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు, స్వాతంత్య్ర సమరయోధుల పెన్షన్ పొందుతున్నవారు ఆసరాకు అనర్హులు
  • దరఖాస్తుదారులకు ఎక్కువ ఇన్‌కమ్ వచ్చే వ్యాపారాలు ఉండరాదు
  •  పెన్షన్‌కు దరఖాస్తు చేసుకునేవారు.. డాక్టర్లు, కాంట్రాక్టర్లు, అధిక ఆదాయం కలిగిన ఇతర వృత్తులు, వ్యాపారాల్లో కొనసాగుతున్న వారి సంతానంపై ఆధారపడి ఉన్నవారై ఉండరాదు.
  • లబ్ధిదారుల సంతానం ప్రభుత్వ, ప్రైవేటు, ఔట్‌ సోర్సింగ్, కాంట్రాక్ట్‌ ఉద్యోగులై ఉండరాదు
  • హెవీ వెహికిల్స్ ఉన్నవారు ఆసరాకు అనర్హులు, ఐటీ రిటర్నులు దాఖలు చేసినామ అనర్హులే

Also Read: చెవిటికల్లు వద్ద హైటెన్షన్.. వరదలో వందలాది లారీలు.. అనుకోకుండా

“నేనే మంత్రాలతో చంపా.. పూజలతో మళ్లీ బ్రతికిస్తా”.. జగిత్యాలలో కలకలం