Telangana: ఉపాధికల్పన పెంచే దిశగా కేంద్రం అడుగు.. తెలంగాణలో 31 కొత్త FM రేడియో స్టేషన్లు..

| Edited By: Surya Kala

Aug 29, 2024 | 4:17 PM

బుధవారం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో.. ఈ మూడోదశ ప్రాజెక్టునకు ఆమోదముద్ర పడింది. తెలంగాణలో.. ఆదిలాబాద్, కొత్తగూడెం వంటి వెనుకబడిన జిల్లాలతో (యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్) పాటుగా.. కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, మంచిర్యాల్, నల్గొండ, రామగుండం, సూర్యాపేట జిల్లాలకు మూడు రేడియో చానల్స్ చొప్పన ఇవ్వనుండగా.. నిజామాబాద్ జిల్లాకు 4 చానల్స్ ను కేటాయించారు.

Telangana: ఉపాధికల్పన పెంచే దిశగా కేంద్రం అడుగు.. తెలంగాణలో 31 కొత్త FM రేడియో స్టేషన్లు..
New Radio Fm Stations
Follow us on

ప్రాంతీయ భాషలకు ప్రోత్సాహాన్ని అందించడంతోపాటుగా, ఉపాధికల్పన పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రయివేట్ FM రేడియో స్టేషన్ల మూడో దశలో భాగంగా దేశవ్యాప్తంగా 234 నగరాల్లో 730 FM రేడియో స్టేషన్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఇందులో తెలంగాణ నుంచి 31 స్టేషన్లకు అవకాశం దక్కింది. బుధవారం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో.. ఈ మూడోదశ ప్రాజెక్టునకు ఆమోదముద్ర పడింది.

తెలంగాణలో.. ఆదిలాబాద్, కొత్తగూడెం వంటి వెనుకబడిన జిల్లాలతో (యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్) పాటుగా.. కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, మంచిర్యాల్, నల్గొండ, రామగుండం, సూర్యాపేట జిల్లాలకు మూడు రేడియో చానల్స్ చొప్పన ఇవ్వనుండగా.. నిజామాబాద్ జిల్లాకు 4 చానల్స్ ను కేటాయించారు.

ఇలాంటి చానల్స్ ఏర్పాటు కారణంగా.. ప్రాంతీయ భాషలు, స్థానిక యాసల్లో సృజనాత్మకమైన కంటెంట్‌ను ప్రజలకు అందించేందుకు వీలుంటుంది. దీంతోపాటుగా ప్రభుత్వ పథకాలను మరింత సమర్థవంతంగా క్షేత్రస్థాయి వరకు చేర్చేందుకు వీలు కలుగుతుంది.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..