Tiger: కుమ్రం భీం జిల్లాలో మరోసారి పెద్దపులి కలకలం.. భయంతో వణికిపోతున్న జనం
మరోసారి కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి కలకలం సృష్టిస్తోంది. జిల్లాలోని పెంచికల్‌పేట మండలంలో ఉన్న కొండపల్లి అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు స్థానికులు తెలిపారు.
Tiger Sighted in Komaram Bheem District: మరోసారి కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి కలకలం సృష్టిస్తోంది. జిల్లాలోని పెంచికల్‌పేట మండలంలో ఉన్న కొండపల్లి అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. శనివారం ఉదయం అటవీ ప్రాంతంలోని రహదారులపై వాహనదారులకు పెద్దపులి కనిపించినట్లు గ్రామస్తులు చెప్పారు. దీంతో విషయాన్ని అటవీ అధికారులకు చేరవేశారు. ఈ నేపథ్యంలో కొండపల్లి పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
బెజ్జూరు, పెంచికల్‌పేట శివార్లలో గత కొన్నిరోజులుగా పెద్దపులి సంచరిస్తున్నది. రహదారిపై సంచరిస్తుండగా స్థానికులు గమనించారు. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పెద్దపులి సంచరిస్తున్న వార్త చుట్టుపక్కల గ్రామాలకు సైతం వ్యాపించడంతో జనం భయంతో వణికిపోతున్నారు. కొమురంభీం జిల్లా: పెంచికల్ పేట మండలం కొండపల్లి ఎక్స్ రోడ్ మూలమలుపు వద్ద ఉదయం పూట పులి సంచారం. పులి సంచార భయంతో పెంచికల్ పేట కొండపల్లి మద్య రాకపోకలు నిలిచిపోయాయి. గత శనివారం తెల్లవారుజామున లోడ్‌పల్లి బీట్ పరిధిలో ఆవుల మందపై పులి దాడి చేసింది. దీంతో మందలోని ఓ ఆవు మృతి చెందిన విషయం తెలిసిందే.