Telangana tdp president L Ramana : నవ్యాంధ్రప్రదేశ్‌కు అమరావతిని రాజధానిగా ఎంపిక చేసిన తరువాత అభివృద్ధి కోసమే అసైన్డ్ భూములు తీసుకున్నారని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ వివరణ ఇచ్చారు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇవాళ తాజాగా ఇచ్చిన 41 Crpc నోటీసులు పై తాము న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను చూసి బలుపు అనుకుంటున్నారా? అని ఆయన వైసీపీ సర్కారుపై విమర్శలు గుప్పించారు. రాజధాని అమరావతి భూముల్లో ఇన్ సైడ్ ట్రేడింగ్ పై గతంలో కోర్ట్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినాకాని, మరోసారి కొత్త కేసు పెట్టి తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇలాంటి కేసులకు టీడీపీ భయపడదని ఎల్ రమణ తేల్చిచెప్పారు. న్యాయపరంగా ఈ నోటిసులు పై ముందుకు వెళతామని ఆయన స్పష్టం చేశారు.
Read also :