TSRTC: సజ్జనార్ అంటే మామూలుగా ఉండదు మరి.. ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్నారు..

TSRTC - Sajjanar: ‘‘అయ్యయ్యో వద్దమ్మా..’’ అంటూ ప్రముఖ టీ కంపెనీ బ్రూక్ బాండ్ రెడ్ లేబుల్ ఇచ్చిన యాడ్ ఎంతగా ఫేమస్ అయ్యిందో మనకు తెలిసిందే. హైదరాబాద్‌కు చెందిన ఓ కుర్రాడు..

TSRTC: సజ్జనార్ అంటే మామూలుగా ఉండదు మరి.. ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్నారు..
Sajjanar
Follow us

|

Updated on: Oct 13, 2021 | 11:38 AM

TSRTC – Sajjanar: ‘‘అయ్యయ్యో వద్దమ్మా..’’ అంటూ ప్రముఖ టీ కంపెనీ బ్రూక్ బాండ్ రెడ్ లేబుల్ ఇచ్చిన యాడ్ ఎంతగా ఫేమస్ అయ్యిందో మనకు తెలిసిందే. హైదరాబాద్‌కు చెందిన ఓ కుర్రాడు ఆ యాడ్‌ డైలాగ్స్‌ని తీన్మార్‌ స్టెప్పుగా మార్చడంతో అదికాస్తా పీక్స్‌కి వెళ్లింది. ఆ తరువాత ప్రతీ ఒక్కరూ తమ తమ స్టైల్‌లో దాన్ని తర్జుమా చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. అయితే, ట్రెండ్ సెట్టర్‌గా గుర్తింపు పొందిన ఐపీఎస్ ఆఫీసర్ సజ్జనార్.. దీన్ని అందిపుచ్చుకున్నారు. ఈ ట్రెండీ డైలాగ్స్‌ని ఆర్టీసీ సంస్థ డెవలప్‌మెంట్‌ కోసం వాడే ప్రయత్నం చేశారు. ఇప్పుడిది సోషల్ మీడియాలో ఒక రేంజ్‌లో రచ్చ చేస్తోంది. ఇంతకీ సజ్జనార్ ఏం చేశారు? నెటిజన్ల నుంచి ఎలాంటి రెస్పాండ్స్ వస్తోంది.. ఇప్పుడు తెలుసుకుందాం..

‘‘అయ్యయ్యో వద్దమ్మా.. సుఖీభవ సుఖీభవ..’’ అంటూ సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో పేలిన ఈ డైలాగ్‌ను ఇటీవలే ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన సజ్జనార్ అవకాశంగా మలచుకున్నారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన సంస్థ అభివృద్ధి కోసం వివిధ ప్రయత్నాలు చేస్తున్నారు. పలు మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. ఈ క్రమంలో దసరా పండుగ రావడంతో ప్రయాణికులను ఆకట్టుకునేందుకు సరికొత్త ప్రయత్నం చేశారు. ‘సుఖీభవ.. సుఖీభవ’ అంటూ ప్రజల మెప్పు పొందేందుకు కృషి చేశారు.

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తరఫున ‘‘అయ్యయ్యో వద్దమ్మా.. సుభీభవ సుఖీభవ’’ అంటూ తీన్మార్ మ్యూజిక్‌తో కూడిన వీడియో తీసి.. సోషల్ మీడియాలోకి వదిలారు సజ్జనార్. ఈ వీడియోలో ఓ వ్యక్తి ఊరుకు వెళ్తుంటాడు. లగేజ్ బ్యాగ్ చేత పట్టుకుని రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తుండగా.. మరో వ్యక్తి చిన్న పిల్లలతో కలిసి డ్యాన్స్ చేస్తూ కనిపిస్తాడు. దాంతో అతన్ని తమ్మీ అని పిలుస్తాడు. ‘‘తమ్మి తమ్మి.. నేను జీపు లో ఊరికి పోతున్నా’’ అని అతనికి చెప్తాడు. దానికి బదులిచ్చిన మరో వ్యక్తి.. ‘‘అయ్యయ్యో వద్దన్నా.. పక్కనే ఆర్టీసీ బస్సు ఉంది. క్షేమంగా వెళ్లొచ్చు. డబ్బులు ఎక్కువ తీసుకోరు. కానీ, సుఖీభవ సుఖీభవ’’ అని దీవిస్తాడు. అనంతరం తీన్మార్ మ్యూజిక్‌కు స్టెప్పులేస్తాడు. ఈ వీడియోను సజ్జనార్ తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేశారు. ‘‘అయ్యయ్యో వద్దమ్మా కానీ.. సుఖీభ‌వ‌ సుఖీభ‌వ‌.. నమ్మకానికి భరోసా మన టీఎస్ఆర్‌టీసీ’’ అంటూ క్యాప్షన్ పెట్టారు. అలాగే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితం, సుఖమయం, శుభప్రదం అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. సజ్జనార్ ఎక్కడున్నా.. తన మార్క్ రూలింగ్ చూపిస్తారంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు. ఆర్టీసీ అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఫలించాలని ఆకాంక్షిస్తున్నారు.

Also read:

Crime News: పాము కాటుతో మరణించిన భార్య.. భర్తకు మరణ శిక్ష..! ఎందుకంటే..?

సైబర్‌ మోసాల తర్పీదు కోసం స్పెషల్ ట్రైనింగ్ సెంటర్స్.. రాచకొండ పోలీసుల దర్యాప్తులో సంచలన నిజాలు

UGC సంచలన నిర్ణయం..! అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు PhD అవసరం లేదు.. ఎప్పటివరకంటే..?