TSRTC: సింగరేణి సందర్శనకు టిఎస్‌ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ.. బొగ్గు గనులు చూడాలనుకునేవారికి అద్భుత అవకాశం..
TSRTC Singareni Darshan Tour package: తెలంగాణ బొగ్గు అంటే గుర్తొచ్చేది. సింగరేణి.. శతాబ్ధానికి పైగా చరిత్ర ఉన్న సింగరేణి బొగ్గు గనులు చూడాలని ఎవరికి ఉండదు. సింగరేణి బొగ్గు గనులను చూడాలనుకునేవారికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అద్భుత అవకాశం కల్పిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోని..
![TSRTC: సింగరేణి సందర్శనకు టిఎస్‌ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ.. బొగ్గు గనులు చూడాలనుకునేవారికి అద్భుత అవకాశం..](https://images.tv9telugu.com/wp-content/uploads/2022/12/tsrtc-singareni-darshan-tour-package.jpg?w=1280)
TSRTC Singareni Darshan Tour package: తెలంగాణ బొగ్గు అంటే గుర్తొచ్చేది. సింగరేణి.. శతాబ్ధానికి పైగా చరిత్ర ఉన్న సింగరేణి బొగ్గు గనులు చూడాలని ఎవరికి ఉండదు. సింగరేణి బొగ్గు గనులను చూడాలనుకునేవారికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అద్భుత అవకాశం కల్పిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోని ప్రాణహిత-గోదావరి లోయలో 350 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న సింగరేణి బొగ్గు నిల్వల సందర్శన కోసం టిఎస్‌ఆర్టీసీ సింగరేణి దర్శన్ అనే ప్యాకేజీని అందిస్తోంది. ఒక్కో వ్యక్తికి రూ. 1,600 టికెట్ ధరగా నిర్ణయించింది. ఈ ప్యాకేజీలో భూగర్భ గని వీక్షణ, ఓపెన్ కాస్ట్ గనుల వీక్షణ, జైపూర్ పవర్ ప్లాంట్, రెస్క్యూ స్టేషన్ వీక్షించవచ్చు. ఇదే ప్యాకేజీలో శాఖాహార భోజనాన్ని అందిస్తారు. ఈ ప్యాకేజీలో ప్రయాణించాలనుకునే వారికి హైదరాబాద్ లోని మహాత్మాగాంధీ బస్టాండ్, జూబ్లీ బస్ స్టేషన్ నుంచి బస్సులు అందుబాటులో ఉంటాయి. ఈ రెండు బస్ స్టేషన్లను పికప్ పాయింట్లుగా నిర్ణయించారు. మరిన్ని వివరాలను 040-69440000 లేదా 040-23450033 నెంబర్లలో సంప్రదించి మరిన్ని వివరాలు పొందవచ్చు. లేదా www.tsrtconline.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని అధికారులు తెలిపారు.
గోదావరి ప్రాణహిత లోయ ప్రాంతాల్లో దేశ అవసరాల కోసం బొగ్గు తవ్వకాలను సింగరేణి చేపట్టిన విషయం తెలసిందే. తొలుత 1889లో ఇల్లెందు ప్రాంతంలో ప్రారంభించిన తవ్వకాలు 1928లో బెల్లంపల్లి, 1937లో కొత్తగూడెం ప్రాంతానికి చేరుకున్నాయి.
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1961లో మందమర్రి, రామగుండం ఏరియా, 1975లో శ్రీరాంపూర్, మణుగూరు, 1991లో భూపాలపల్లి ప్రాంతంలో బొగ్గు ఉత్పత్తికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం 11 ప్రాంతాల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సింగరేణి సంస్థ బొగ్గు వెతికితీస్తోంది. ఈ గనుల వీక్షణ కోసం సామాన్య ప్రజలకు అవకాశం కల్పిస్తూ టిఎస్‌ఆర్టీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందిస్తోంది.
![Image](https://images.tv9telugu.com/wp-content/uploads/2022/12/tax-deduction-expectations-in-upcoming-inion-budget-2023-24.jpg)
![Image](https://images.tv9telugu.com/wp-content/uploads/2022/12/new-helmet-rule-pay-fine-o.jpg)
![Image](https://images.tv9telugu.com/wp-content/uploads/2022/12/batta-meka-bird.jpg)
![Image](https://images.tv9telugu.com/wp-content/uploads/2022/12/covid-vaccine-file-photo.jpg)
మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..