Telangana SSC Result: తెలంగాణలో కరోనా కారణంగా పదో తరగతి పరీక్షలు రద్దు అయ్యాయి. పరీక్షల కోసం ఫీజులు చెల్లించిన విద్యార్థులందరిని పాస్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే పదో తరగతి ఫలితాల వెల్లడికి రాష్ట్ర విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఫార్మేటివ్ అసెస్ మెంట్ మార్కుల ఆధారంగానే విద్యార్థులకు గ్రేడ్లు కేటాయించాలని నిర్ణయించింది. ప్రస్తుతం మార్కుల అప్‌లోడింగ్, గ్రేడింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మార్కులు అప్‌లోడ్ పూర్తి కాగానే ఫలితాలు ప్రకటించాలని విద్యాశాఖ భావిస్తోంది. గత సంవత్సరం కూడా ఫార్మేటివ్ అసెస్‌మెంట్ మార్కుల ఆధారంగానే ఫలితాలు వెల్లడించారు. షెడ్యూల్ ప్రకారం ఈనెల 17న పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ సర్కార్ కొన్ని నెలల కిందటనే షెడ్యూల్ ప్రకటించింది. అయితే కోవిడ్ సెకండ్‌వేవ్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. అయితే ఇక బోర్డు వెల్లడించిన ఫలితాలతో సంతృప్తి చెందని విద్యార్థులు.. పరిస్థితులు చక్కబడిన తర్వాత వ్యక్తిగతంగా పరీక్షలు రాయవచ్చని గతంలో విద్యాశాఖ వెల్లడించింది.
Job Notification: నిరుద్యోగులకు శుభవార్త.. పేరొందిన ఆ ప్రముఖ సంస్థలో ఉద్యోగాలకు నోటిఫికేషన్