KTR: సిరిసిల్ల నేత బ్రతుకుల్లో సిరిసిరి మువ్వలు.. నిన్నమొన్నటి వరకు బతుకమ్మ చీరల తయారీ.. ఇప్పుడు..

అవును.. తెలంగాణ రాష్ట్రంలోని సిరిసిల్ల నేత కార్మికులకు ఇప్పుడు చేతినిండా పని దొరుకుతుంది. నిన్నమొన్నటి వరకు తెలంగాణ ప్రభుత్వం అందించే బతుకమ్మ చీరల తయారీతో బిజీగా

KTR: సిరిసిల్ల నేత బ్రతుకుల్లో సిరిసిరి మువ్వలు.. నిన్నమొన్నటి వరకు బతుకమ్మ చీరల తయారీ.. ఇప్పుడు..
Follow us
Venkata Narayana

|

Updated on: Oct 24, 2021 | 10:34 AM

Sircilla: అవును.. తెలంగాణ రాష్ట్రంలోని సిరిసిల్ల నేత కార్మికులకు ఇప్పుడు చేతినిండా పని దొరుకుతుంది. నిన్నమొన్నటి వరకు తెలంగాణ ప్రభుత్వం అందించే బతుకమ్మ చీరల తయారీతో బిజీగా ఉన్న నేతకార్మికులు.. తమిళనాడు ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్లతో ఇప్పుడు మరింత బిజీగా మారారు. ఈ అపూర్వ ఘట్టాన్ని ఇప్పుడు సాక్షాత్తూ మంత్రి కేటీఆర్ ప్రస్తావించారు. ఒక వార్తా పత్రికలో వచ్చిన క్లిప్లింగ్ ను జతచేసి మరీ సిరిసిల్ల నేతన్నల ఉపాది అవకాశాల గురించి చెప్పుకొచ్చారు తెలంగాణ మంత్రి కేటీఆర్.

ఇలా ఉండగా, తెలంగాణ రాష్ట్రం సిద్ధించిననాటి నుంచీ కేసీఆర్ సర్కారు సిరిసిల్ల నేతన్నలకు ఏడాదంతా ఉపాధి కల్పించడానికి సర్కారుచర్యలు తీసుకుంటోంది. ఉపాధి అవకాశాల కోసం నిరంతరాయంగా ఆర్డర్లు సమకూరుస్తోంది. ఇప్పటికే రాజన్నసిరిసిల్ల జిల్లాలో నేతన్నలకు రూ.300 కోట్ల బతుకమ్మ చీరల ఆర్డర్తో తెలంగాణ ప్రభుత్వం ఉపాధి కల్పించింది. ప్రస్తుతం క్రిస్మస్, రాజీవ్ విద్యా మిషన్(ఆర్వీఎం) ఆర్డర్లు కూడా ఇస్తూ వారికి చేతినిండా పని కల్పిస్తోంది. బతుకమ్మ చీరలు సెప్టెంబర్ మాసంతో పూర్తవుతాయి. ఆ తర్వాత నేతన్నలు ఖాళీగా ఉండకుండా క్రిస్మస్ కానుకలు ఇవ్వడం కోసం సర్కారు రూ.15 కోట్ల ఆర్డర్ ఇచ్చింది.

దీనికి తోడు రాజీవ్ విద్యా మిషన్(ఆర్వీఎం)కు సంబంధించి 1.3 కోట్ల మీటర్ల వస్త్రాన్ని కొనుగోలు చేయడానికి రూ.60 కోట్లు మంజూరు చేసింది. చేనేత జౌళిశాఖ అధికారులు ఇప్పటికే సిరిసిల్ల ఎస్ఎస్ఐ సంఘాలతో వస్త్రం తయారు చేయిస్తున్నారు. దీంతో సిరిసిల్లలో15 వేల మంది కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి. ఈ పని ముగియగానే రంజాన్ పండుగకు 6 లక్షల మీటర్ల వస్త్రాన్ని తయారు చేయించనున్నారు. రంజాన్ కానుకల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.3 కోట్లు వెచ్చించనుంది. ఇలా ఉంటే, ప్రస్తుతం తాజాగా వచ్చిన తమిళనాడు ప్రభుత్వం ఆర్డర్లతో ఇప్పుడు సిరిసిల్ల నేత కుటుంబాలు క్షణం తీరికలేకుండా మారిపోయాయి.

Read also: Paritala: అనంతపురం జిల్లా నుంచి బ్రేకింగ్‌ న్యూస్‌.. ధర్మవరంలో టెన్షన్ టెన్షన్‌.. రంగంలోకి పరిటాల

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!