TS RTC: సరికొత్త నిర్ణయాలు, సంస్కరణలను తీసుకొస్తూ దూకుడు మీదున్న తెలంగాణ ఆర్టీసీ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై మహిళా కండక్టర్లు రాత్రి 8 గంటలకల్లా తమ డిపోలకు చేరుకునేలా డ్యూటీలు ఉండాలని ఉత్తర్వులు జారీచేశారు. మహిళా కండక్టర్ల భద్రతను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయమై తాజాగా ఆర్టీసీ ఎండీ వి.సి సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి రావాలని సజ్జనార్ అధికారులకు తెలిపారు.
ఇదిలా ఉంటే ఈ విధానం అమల్లోకి రావడం ఇదే తొలిసారి కాదు. గతంలో 2019 డిసెంబర్‌లో అన్ని స్థాయి ఉద్యోగులతో ముఖ్యమంత్రి నిర్వహించిన సమావేశంలో మహిళా కండక్టర్లకు రాత్రుళ్లు ఇబ్బందిగా మారుతుందన్న అంశం తెరపైకి వచ్చింది. దీంతో మహిళా కండక్టర్ల అభ్యర్థన మేరకు రాత్రి 8 కల్లా డ్యూటీ ముగిసేలా చర్యలు తీసుకోవాలని సీఎం అప్పుడే ఆదేశించారు. అధికారులు ఈ విధానాన్ని అమల్లోకి కూడా తీసుకొచ్చారు. అయితే కేవలం కొన్ని రోజులు మాత్రమే అమలు చేసి, ఆ తర్వాత రద్దు చేశారు. దీంతో మరోసారి మహిళా కండక్టర్ల నుంచి విజ్ఞప్తులు వచ్చిన నేపథ్యంలో ఎండీ సజ్జనార్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. రాత్రి 8 గంటల కల్లా డ్యూటీలు ముగిసేలా తీసుకున్న నిర్ణయంపై మహిళా కండక్టర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Watch Video: తొలి ఓవర్‌లోనే దక్షిణాఫ్రికా వికెట్ పడగొట్టాడు.. ఆపై గాయంతో మైదానం వీడాడు..!
Calcium Rich Foods: కాల్షియం లోపంతో బాధపడుతున్నారా? అయితే, ఈ పదార్థాలను మీ ఆహారంలో చేర్చాల్సిందే..!