TS RTC New Website: తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్. ఆర్టీసీ(TS RTC Bus) కొత్త వెబ్ సైట్ బుధవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ చైర్మెన్ బాజీ రెడ్డి గోవర్ధన్(MLA Bajireddy Govardhan), ఎండీ సజ్జనార్(VC Sajjanar) ఈ కొత్త వెబ్ సైట్ ను ప్రారంభించారు. దీంతో టీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్ పోర్టల్ ఇక నుంచి వెబ్ సైట్ గా మారింది. కాగ హైదరాబాద్ లోని బస్ భవన్‌లో గణతంత్ర దినోత్సవం వేడుకల్లో ఆర్టీసీ చైర్మెన్, ఎండీ పాల్గొన్నారు.
అనంతరం ఆర్టీసీ కొత్త వెబ్ సైట్ ను ప్రారంభించారు. పాత వెబ్ సైట్ ను కాస్త మార్చి కొత్త హంగులను జోడించి ఈ వెబ్ సైట్ ను రెడీ చేశారు. ఈ కొత్త వెబ్ సైట్ చాలా సులువుగా ఉంటుందని వారు తెలిపారు. సామాన్యులు కూడా ఈ కొత్త వెబ్ సైట్ ను వినియోగించేలా ఉంటుందన్నారు.
అలాగే అందరూ కూడా టీఎస్ఆర్టీసీ కొత్త వెబ్ పోర్టల్ ను సందర్శించాలని కోరారు. అలాగే ప్రయాణీకుల సూచనలు, అభిప్రాయాలను కూడా ఈ వెబ్ సైట్ ద్వారా తమ దృష్టికి తీసుకురావచ్చని అన్నారు.
ఇవి కూడా చదవండి: Viral Video: నువ్వు తగ్గొద్దన్న.. పాకిస్తాన్ జర్నలిస్ట్ మళ్లీ ఏసేశాడు.. నవ్వులు పూయిస్తున్న వీడియో..
Medicinal Plants: ఔషద మొక్కల పెంపకంతో అద్భుతాలు.. ఎలాంటివి ఎంచుకోవాలో తెలుసా..