Telangana:  సంక్రాంతి తర్వాత ఆర్టీసీ ఛార్జీల బాదుడు !.. సీఎం కేసీఆర్‌ ఆమోదమే తరువాయి.. కిలోమీటరుకు ఎంత వరకు పెరగొచ్చంటే..

|

Dec 30, 2021 | 1:29 PM

ఇప్పటికే విద్యుత్‌ ఛార్జీల పెంచేసిన తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే ఆర్టీసీ ఛార్జీల పెంపుపై కూడా కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది

Telangana:  సంక్రాంతి తర్వాత ఆర్టీసీ ఛార్జీల బాదుడు !.. సీఎం కేసీఆర్‌ ఆమోదమే తరువాయి.. కిలోమీటరుకు ఎంత వరకు పెరగొచ్చంటే..
Tsrtc
Follow us on

ఇప్పటికే విద్యుత్‌ ఛార్జీల పెంచేసిన తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే ఆర్టీసీ ఛార్జీల పెంపుపై కూడా కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. రోజువారీ నష్టాలతో పాటు పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన ఆర్టీసీని గట్టెక్కించాలంటే ఛార్జీలు పెంచక తప్పదని ఇప్పటికే ఆర్టీసీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీనిపై స్పందించిన కేసీఆర్‌ రవాణా శాఖ మంత్రి, ఆర్టీసీ ఉన్నతాధికారులతో పలుమార్లు చర్చించి ఛార్జీల పెంపునకు అనుమతి ఇచ్చారు. ఈ క్రమంలోనే సవరించిన ఛార్జీలతో కూడిన ఫైల్‌ను ఆర్టీసీ అధికారులు ప్రభుత్వానికి సమర్పించారు. పల్లెవెలుగు బస్సుల్లో కిలోమీటరుకు 25పైసలు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో 30 పైసలు వరకు పెంచాలని ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు. త్వరలోనే సీఎం కేసీఆర్‌ అధికారిక ఆమోదం లభిస్తుందని వారు భావిస్తున్నారు.

కాగా ప్రస్తుతమున్న సమాచారం ప్రకారం.. సంక్రాంతి పండగ తర్వాత ఆర్టీసీ ఛార్జీల పెంపు ప్రకటన వెలువడే సూచనలు కనిపిస్తున్నాయి. కాగా ఆఖరుగా ఆఖరుగా డిసెంబర్ 5, 2019లో ఆర్టీసీ ఛార్జీలను పెంచారు. ఆ తర్వాత డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. దీనికి తోడు కరోనాతో ఆక్యుపెన్సీ కూడా భారీగా పడిపోయింది. దీంతో టీఎస్‌ఆర్టీసీ భారీ నష్టాల్లో కూరుకుపోయింది. ఈనేపథ్యంలో ఛార్జీలను పెంచాలని ఆర్టీసీ అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.

Also Read:

Coronavirus: చాపకింద నీరులా ఒమిక్రాన్‌.. కరోనా బాధితుల్లోనూ భారీ పెరుగుదల.. నిన్న ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..

Mahabubabad: పత్తి బస్తాలను ఓపెన్‌ చేయగానే షాక్‌.. ఇంతకీ అందులో ఏముందంటే..

Nidhhi Agerwal: పవర్ స్టార్ పాటనే మళ్లీ మళ్లీ వింటున్నా.. ఇస్మార్ట్‌ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌..