Telangana Corona: తెలంగాణలో క్రమంగా తగ్గుతున్న కరోనా ఉధృతి.. జీహెచ్ఎంసీలోనే అత్యధిక కేసులు

|

Jun 18, 2021 | 7:51 PM

Covid-19 Cases in Telangana: తెలంగాణలో క్రమంగా కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1417 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 12 మంది

Telangana Corona: తెలంగాణలో క్రమంగా తగ్గుతున్న కరోనా ఉధృతి.. జీహెచ్ఎంసీలోనే అత్యధిక కేసులు
Telangana Corona
Follow us on

Covid-19 Cases in Telangana: తెలంగాణలో క్రమంగా కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1417 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 12 మంది మరణించారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,10,834 కి చేరింది. ఇప్పటివరకూ మరణించిన వారి సంఖ్య 3,546 కి పెరిగింది. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం సాయంత్రం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. గత 24 గంటల్లో కరోనా నుంచి 1,897 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి మొత్తం కోలుకున్న వారి సంఖ్య 5,88,259 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 19,029 కేసులు యాక్టివ్ గా ఉన్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా 1,24,430 మందికి కొవిడ్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. రాస్ట్రంలో అత్యధికంగా జీహెచ్ఎంసీ ప‌రిధిలో 149, రంగారెడ్డిలో 104, ఖ‌మ్మంలో 93, న‌ల్ల‌గొండ‌లో 88, క‌రీంన‌గ‌ర్‌లో 87, సూర్యాపేట‌లో 85 పాజిటివ్ కేసులు న‌మోదయ్యాయి. కాగా.. తెలంగాణలో కరోనా కేసుల కన్నా.. రికవరీ శాతం అత్యధికంగా ఉంది.

Also Read:

Covid-19 Third Wave: అక్టోబ‌ర్‌లోనే క‌రోనా థ‌ర్డ్ వేవ్.. చిన్నారులపై ప్రభావం.. స‌ర్వేలో సంచలన విషయాలు..

Cristiano Ronaldo: అలా చేయడం రూల్స్‌ను ఉల్లంఘించడమే..! రోనాల్డో పై యూఈఎఫ్ఏ ఫైర్