Telugu News Telangana Telangana records 715 positive cases and 4 deaths in last 24 hours
Telangana Coronavirus: తెలంగాణలో స్వల్పంగా పెరిగిన కేసులు.. తాజాగా ఎన్ని నమోదయ్యాయంటే..?
Telangana Covid-19 Updates: తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ అనంతరం.. కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గతంలో భారీగా నమోదైన పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య
Telangana Covid-19 Updates: తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ అనంతరం.. కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గతంలో భారీగా నమోదైన పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య ప్రస్తుతం భారీగా తగ్గాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 715 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ శుక్రావారం సాయంత్రం హెల్త్ బులెటిన్ ను విడుదల చేసింది. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో ఇప్పటి వరకు 6,35,320 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఈ మహమ్మారి కారణంగా 3,751 మంది మరణించారు. ఇక తాజాగా రాష్ట్రంలో 784 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 6,21,5431 కి పెరిగింది. కాగా.. రాష్ట్రంలో రికవరీ రేటు 97.83 శాతానికి చేరగా.. మరణాల రేటు 0.59 శాతం ఉన్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 10,028 యాక్టివ్ కేసులు ఉన్నాయి.