Telangana Corona Update: తెలంగాణలో పూర్తిగా తగ్గుముఖం పట్టిన కరోనా పాజిటివ్ కేసులు.. తాజాగా ఎన్ని కేసులంటే..
Telangana Coronavirus Cases: తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 161 పాజిటివ్ కేసులు నమోదు కాగా..

Telangana Coronavirus Cases: తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 161 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఒకరు మృతి చెందినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 2,95,431కు చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ శనివారం హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో మృతుల సంఖ్య 1,608కి చేరింది. కరోనా నుంచి నిన్న 147 మంది కోలుకోగా, ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 2.91లక్షలకు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,977 యాక్టివ్ కేసులుండగా, వారిలో 845 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక తాజాగా జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 28 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
Also Read: Coronavirus India: గత 24 గంటల్లో వందలోపే మరణాలు.. తాజాగా ఎంతమంది డిశ్చార్జ్ అయ్యారంటే..?
