17 ఏళ్ల బాలికను అమ్మకానికి పెట్టిన తల్లిదండ్రులు.. రాజస్తాన్ వాసికి విక్రయించే ప్రయత్నం.. ఎందుకు ఇలా చేశారంటే?
మహబూబ్ నగర్ జిల్లా హజిలాపూర్ గ్రామ పరిధిలోని గాలిలోని కుంటలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ అమ్మాయికి పెళ్లి చేయలేని తల్లిదండ్రులు మూడు లక్షలు
మహబూబ్ నగర్ జిల్లా హజిలాపూర్ గ్రామ పరిధిలోని గాలిలోని కుంటలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ అమ్మాయికి పెళ్లి చేయలేని తల్లిదండ్రులు మూడు లక్షలు వస్తున్నాయని కాదా అని అమ్మేయడానికి సిద్ధమయ్యారు. పేదరికం ఎంతటి పని చేయడానికైనా ఉసిగొలుపుతుందనే దానికి ఈ ఘటన నిదర్శనంగా చెప్పవచ్చు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
గాలిలోని కుంటకు చెందిన రవినాయక్, వాలమ్మ దంపతులకు నలుగురు సంతానం. హైదరాబాద్‌లో కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని ఆ పోషిస్తున్నారు. ఈ క్రమంలోనే 17 ఏళ్ల రెండో కుమార్తెకు ఎలా పెళ్లి చేయాలన్న దిగులు వారికి పట్టుకుంది. ఈ క్రమంలో వారికి షాద్ నగర్‌కు చెందిన ఓ వ్యక్తితో వారికి పరిచయం అయింది. ఆ వ్యక్తితో వీరు తమ సమస్యను చెప్పుకున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం ఆ వ్యక్తి రవినాయక్ ఇంటికి వచ్చి ఓ విషయం చెప్పాడు. రాజస్థాన్‌లో అమ్మయిలు తక్కువని, నాకు తెలిసిన రాజస్థాన్‌కు చెందిన వ్యక్తికి ఇచ్చి మీ అమ్మాయికి పెళ్లి చేద్దామని చెప్పాడు. అందుకు బదులుగా అతడే మూడు లక్షల రూపాయలు ఇస్తాడని ఆశ చూపాడు. దీంతో వారు సరేనన్నారు.
శుక్రవారం ఉదయం నవాబ్ పేట నుంచి ఆ అమ్మాయిని తీసుకుని హైదరాబాద్ కు బయల్దేరారు. అక్కడి నుంచి రాజస్థాన్ కు పంపించాలన్నది ఆ వ్యక్తి ఆలోచన. అయితే ఈ విషయం దుబాయిలో ఉంటున్న రవి నాయక్ సోదరుడికి తెలిసింది. వెంటనే ఆ బాలిక బాబాయ్, నవాబ్ పేట పోలీసులకు దుబాయి నుంచే ఫోన్ చేశాడు. విషయం అంతా పూసగుచ్చినట్టు చెప్పి, ఆమెను కాపాడాలని కోరాడు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన నవాబ్ పేట పోలీసులు ఎట్టకేలకు ఆ దంపతులను, బాలికను పట్టుకున్నారు. వారితోపాటు ఉన్న ఆ వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. బాలికను మహబూబ్ నగర్ లోని స్టేట్ హోంకు తరలించారు.
India vs England: టీమ్ ఇండియా నిర్ణయం సరైనది కాదు.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు..