AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Student Suicide: ఇంత చిన్న కారణానికి ఆత్మహత్యా..!.. టెన్త్ క్లాస్ స్టూడెంట్ సూసైడ్.. లెటర్‌లో ఏమి రాశాడంటే..?

ఏ చిన్న సమస్యా వచ్చినా.. ఎదుర్కునే ధైర్యం లేక బలవన్మరణాలవైపు సాగుతోంది ప్రస్తుతం యువత. జీవితం ఎంత గొప్పదో వారికి తెలియడం లేదు. భవిష్యత్‌ గురించి, అమ్మానాన్నల గురించి

Student Suicide: ఇంత చిన్న కారణానికి ఆత్మహత్యా..!.. టెన్త్ క్లాస్ స్టూడెంట్ సూసైడ్.. లెటర్‌లో ఏమి రాశాడంటే..?
Ram Naramaneni
|

Updated on: Feb 06, 2021 | 11:06 AM

Share

Student Suicide:  ఏ చిన్న సమస్యా వచ్చినా.. ఎదుర్కునే ధైర్యం లేక బలవన్మరణాలవైపు సాగుతోంది ప్రస్తుతం యువత. జీవితం ఎంత గొప్పదో వారికి తెలియడం లేదు. భవిష్యత్‌ గురించి, కని..పెంచి, పోషించిన అమ్మానాన్నల గురించి కనీసం ఆలోచన ఉండటం లేదు. పబ్‌జీ ఆడనివ్వడం లేదని కొందరు, ప్రేయసి వదిలేసిందని మరికొందరు, పేరెంట్స్ తిట్టారని కొందరు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు ఇప్పటికే అనేకం చూశాం. తాజాగా ఓ టెన్త్ క్లాస్ స్టూడెంట్ స్కూల్ టీచర్ మందలించాడని ప్రాణం తీసుకున్నాడు. ఈ విచారకర ఘటన వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే..  జిల్లాలోని కులకచర్ల మండల పరిధిలోని చెల్లపూర్ గ్రామంలో హరికృష్ణ అనే 16 ఏళ్ల బాలుడు సూసైడ్ చేసుకున్నాడు. టెన్త్ క్లాస్ చదవుతున్న హరి కృష్ణ.. టీచర్ మందలించాడనే మనస్తాపంతో ఉరి వేసుకొని తనువు చాలించాడు. సాల్విడ్ ఉన్నత పాఠశాలలో హరికృష్ణ టెన్త్ క్లాస్ చదువుతున్నాడు. ఉపాధ్యాయుడు రమేష్ మదలించడం వల్లే తాను సూసైడ్ చేసుకుంటున్నట్లు విద్యార్థి సూసైడ్ నోటు రాశాడు. క్లాస్‌మేట్స్  అందరి ముందు తనను తిట్టాడన్న బాధతోనే ఈ లోకాన్ని వీడుతున్నట్లు సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. విద్యార్థి తండ్రి పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అటు టీచర్ రమేశ్‌ను కూడా పిలిచి విచారణ చేపడుతున్నారు.

Also Read:

Indrakeeladri: బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో అన్నదాన కార్యక్రమం పునః ప్రారంభం.. కోవిడ్ నిబంధనలు తప్పనిసరి

AP Local Body Elections: పంచాయతీ ఎన్నికల వేళ తాయిలాల పరంపర.. భీమవరం మండలంలో భారీగా ప్రెషర్ కుక్కర్లు స్వాధీనం