Visakhapatnam Steel Plant: విశాఖలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆందోళనలు.. భగ్గుమంటున్న కార్మిక, ప్రజా సంఘాలు..
Steel Plant Privatization: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రం నిర్ణయాన్ని పార్టీలకతీతంగా నేతలంతా
Steel Plant Privatization: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రం నిర్ణయాన్ని పార్టీలకతీతంగా నేతలంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కార్మిక, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు నిరసనలతో హోరెత్తిస్తున్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. నిర్ణయాన్ని కచ్చితంగా వెనక్కి తీసుకోవాలని, అప్పటి వరకు పోరాటం ఆగదని చెబుతున్నారు. పెదగంట్యాడ జంక్షన్‌లో నిర్వాసితులకు మద్దతుగా టీఎన్జీయూసీ ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగుతోంది. కార్యక్రమంలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు పాల్గొననున్నారు. మద్దిలపాలెం జంక్షన్‌లో వామపక్ష ప్రజా సంఘాలు రహదారి దిగ్బంధానికి పిలుపునిచ్చాయి. మరోవైపు స్టీల్ ప్లాంటు మెయిన్ గేటు దగ్గర బీఎమ్ఎస్ నిరసన వ్యక్తం చేస్తుంది. ఈ నిరసనలో గాజువాక బీజేపీ నాయకులు పాల్గొననున్నారు.
ఇదిలా ఉంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర ప్రయత్నాలు నేపథ్యంలో నగరంలోని దాసరి భవన్‌లో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, కాంగ్రెస్ మహిళ నేత సుంకర పద్మశ్రీ, సీపీఎం సీనియర్ నేత వై వి, ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ తదితరులు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీపీఎం నేత వై వి మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయడాన్ని అందరు వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. విశాఖ ఉక్కు పై తాము పోరాటం చేస్తామని ఏపీ బీజేపీ నేత సోము వీరాజు అంటున్నారు. సుజనా ప్రైవేటుకి ఇవ్వొచ్చని చెబుతున్నాడు. ఎంపీ రామ్మోహన్ నాయుడు లేఖ రాశారు సంతోషం. ఈ వ్యవహారం లో ముఖ్యమంత్రి చొరవతీసుకొని కేంద్రంతో మాట్లాడాలి. రైల్వే జోన్ ఇంకా పరిశీలనలో ఉందంటు గుర్తుచేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం గతం లో ఇచ్చిన హామీలతో పాటు స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లాలి. కేంద్రం వెనక్కి తగ్గకపోతే ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
India vs England: ఆటగాళ్లకు సెలవులు ఇవ్వాలి.. లేదంటే కష్టమే.. టీమ్ ఇండియా కోచ్ సంచలన కామెంట్స్..
IRCTC : ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆన్‌లైన్ బస్ బుకింగ్ సేవలను ప్రారంభించిన ఐఆర్‌సీటీసీ