హైదరాబాద్ లో రాత్రి డ్రంకన్ డ్రైవ్, హోంమంత్రి మహమూద్ అలీ బంధువులమంటూ అమ్మాయిల హల్చల్
హైదరాబాద్ నగరంలోని పలుచోట్ల పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. తాగి డ్రైవ్ చేసిన వారివద్ద నుండి వాహనాలను సీజ్ చేశారు. వెస్ట్ జోన్ జూబ్లీహిల్స్ పరిధిలో నిర్వహించిన..
హైదరాబాద్ నగరంలోని పలుచోట్ల పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. తాగి డ్రైవ్ చేసిన వారివద్ద నుండి వాహనాలను సీజ్ చేశారు. వెస్ట్ జోన్ జూబ్లీహిల్స్ పరిధిలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో 5 కార్లు , రెండు త్రీ విలర్స్ , 12 టు విలర్స్ వాహనాలను పట్టుకున్నారు పోలీసులు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో జబర్దస్త్ లేడి గెటప్ తన్మయితో పాటు కొంతమంది ప్రైవేట్ ఈవెంట్స్ ఆర్గనైజర్స్ పట్టుబడ్డారు. ఇంకొందరు అమ్మాయిలు హోంమంత్రి మహమూద్ అలీ బంధువులమంటూ పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు.