విశాఖ మానసిక వైద్యశాలకు చేరిన మదనపల్లి జంట హత్యల కేసు కథ, పద్మజ, పురుషోత్తంనాయుడుకి వేరువేరు వార్డుల్లో చికిత్స

మూఢ నమ్మకం వారి ఇద్దరి కూతుళ్లను దూరం చేసింది. ఇప్పుడు మానసిక వైద్యశాలలో చికిత్స తీసుకునేలా చేసింది. ఏదైనా అతి అనర్థమని వీరి ద్వారా మరోసారి నిరూపితమైంది....

విశాఖ మానసిక వైద్యశాలకు చేరిన  మదనపల్లి జంట హత్యల కేసు కథ, పద్మజ, పురుషోత్తంనాయుడుకి వేరువేరు వార్డుల్లో చికిత్స
Follow us
Venkata Narayana

|

Updated on: Feb 06, 2021 | 2:57 AM

మూఢ నమ్మకం వారి ఇద్దరి కూతుళ్లను దూరం చేసింది. ఇప్పుడు మానసిక వైద్యశాలలో చికిత్స తీసుకునేలా చేసింది. ఏదైనా అతి అనర్థమని వీరి ద్వారా మరోసారి నిరూపితమైంది. వీరి అతిభక్తి కాస్త మూఢ నమ్మకంగా మారి ఏకంగా ఇద్దరు కూతుళ్లను పొట్టనబెట్టుకునే వరకు వెళ్లింది. మదనపల్లి జంట హత్యల కేసులో పద్మజ, పురుషోత్తంనాయుడు దంపతులు ఇప్పుడు విశాఖపట్నంలోని మానసిన వైద్యశాలకు చేరారు. ఆసుపత్రిలో భర్తను శ్రీకృష్ణ వార్డులో, భార్యను అరుంధతి వార్డులో ఉంచి చికిత్స కొనసాగిస్తున్నారు మానసిక వైద్యులు.

చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన ఉన్నత విద్యావంతులు పురుషోత్తంనాయుడు, పద్మజ దంపతులు ఇప్పుడు విశాఖలోని మెంటల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. వీరి మానసిక పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు వైద్యులు. యూనిట్‌ చీఫ్‌ పద్మావతి వీరి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. పురుషోత్తంనాయుడు ఒత్తిడిలో ఉన్నట్టు గుర్తించారు. పద్మజ ప్రశాంతంగా ఉన్నట్టు వైద్యుల పరిశీలనలో నిర్థారణ అయింది. వీరిద్దరు రిమాండ్‌ ఖైదీలు కావడంతో ప్రత్యేక ఏర్పాటు చేశారు. వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది తప్ప.. మిగిలిన వారు ఎవరినీ పద్మజ, పురుషోత్తంనాయుడు ఉన్న వార్డు దగ్గరికి అనుమతించడం లేదు.

జనవరి 24 రాత్రి పద్మజ, పురుషోత్తంనాయుడు కూతుళ్లు అలేఖ్య, సాయిదివ్య హత్యకు గురయ్యారు. ఈ కేసులో వారి పేరెంట్స్‌ పద్మజ, పురుషోత్తంనాయుడులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కోర్టు వారికి 14 రోజుల రిమాండ్‌ విధించడంతో వారి మానసికస్థితి సరిగా లేకపోవడంతో విశాఖలోని మానసిక వైద్యశాలకు తరలించారు పోలీసులు. వీరిద్ధరినీ మొదట తిరుపతి రుయాలోని ప్రాంతీయ మానసిక ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ కస్టోడియల్‌ కేర్‌ లేకపోవడంతో విశాఖ మానసిక వైద్యశాలకు తరలించారు. ఇక్కడ వీరి మానసిక పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న వైద్యులు, వారికి ట్రీట్‌మెంట్‌ కొనసాగిస్తున్నారు.

మదనపల్లిలో జంట హత్యల కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దంపతులిద్దరూ మూఢ నమ్మకం వల్లే ఇద్దరు కన్న కూతుళ్లను చేతులారా పొట్టనబెట్టుకున్నారు. నేనే శివుడ్ని, నేనే కాళికను అంటూ పద్మజ జైల్లో ఊగిపోవడంతో మానసికస్థితి సరిగా లేదని విశాఖలోని మానసిక వైద్యశాలకు తరలించారు పోలీసులు.

ఖమ్మం జిల్లా నవ్యారెడ్డి హత్య కేసులో మరో ట్విస్ట్‌, భార్యను చంపిన నాగశేషురెడ్డి మేనమామ కూతురు రైలు కింద పడి సూసైడ్

ఏడు ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు మారిన వర్సిటీలు, కన్వీనర్లు..
ఏడు ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు మారిన వర్సిటీలు, కన్వీనర్లు..
కొత్త సంవత్సరంలో రాజయోగం.. అదృష్టం అంటే ఈ రాశులవారిదే
కొత్త సంవత్సరంలో రాజయోగం.. అదృష్టం అంటే ఈ రాశులవారిదే
అభిమాని అడిగిన ప్రశ్నకు సీరియస్ అయిన విజయ్ సేతుపతి..
అభిమాని అడిగిన ప్రశ్నకు సీరియస్ అయిన విజయ్ సేతుపతి..
నర్సింగ్‌ కాలేజీల్లో అబ్బాయిలకు సైతం ప్రవేశాలు కల్పించాలి
నర్సింగ్‌ కాలేజీల్లో అబ్బాయిలకు సైతం ప్రవేశాలు కల్పించాలి
కాకి బిర్యానీ కోసం 19 కాకులను చంపిన దంపతులు..
కాకి బిర్యానీ కోసం 19 కాకులను చంపిన దంపతులు..
ప్రపంచంలోకెల్లా ఏకైక బ్లూ సిటీ..! ఇదేదో గ్రీస్ దేశం అనుకునేరు..
ప్రపంచంలోకెల్లా ఏకైక బ్లూ సిటీ..! ఇదేదో గ్రీస్ దేశం అనుకునేరు..
ప్రాణంగా పెంచుకున్న కుక్క మృతి..ప్రతి ఏడాది దాన్ని జ్ఞాపకాల్లో..
ప్రాణంగా పెంచుకున్న కుక్క మృతి..ప్రతి ఏడాది దాన్ని జ్ఞాపకాల్లో..
కాంగ్రెస్‌కు గట్టి కౌంటరిచ్చిన ప్రధాని మోదీ
కాంగ్రెస్‌కు గట్టి కౌంటరిచ్చిన ప్రధాని మోదీ
రీల్స్‌ పిచ్చితో వెర్రీ వేషాలు..రోడ్డు వెంట నోట్ల కట్టలతో హల్‌చల్
రీల్స్‌ పిచ్చితో వెర్రీ వేషాలు..రోడ్డు వెంట నోట్ల కట్టలతో హల్‌చల్
ఓర్నీ.. ఆ ఫైనాన్స్‌ కంపెనీలు ఆత్మలకు కూడా లోన్లు ఇస్తాయా ??
ఓర్నీ.. ఆ ఫైనాన్స్‌ కంపెనీలు ఆత్మలకు కూడా లోన్లు ఇస్తాయా ??