India vs England: టీమ్ ఇండియా నిర్ణయం సరైనది కాదు.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
India vs England: భారత పర్యటనలో భాగంగా చెన్నైలో ఇంగ్లాండ్‌తో తొలిటెస్ట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా జట్టులోకి స్పిన్నర్ కుల్‌దీప్
India vs England: భారత పర్యటనలో భాగంగా చెన్నైలో ఇంగ్లాండ్‌తో తొలిటెస్ట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా జట్టులోకి స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్‌ను తీసుకోకపోవడంపై ఇంగ్లాండ్ మాజీ సారథి మైకెల్ వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కుల్‌దీప్‌ను బెంచ్‌కే పరిమితం చేయడం టీమిండియా తీసుకున్న అర్థరహిత నిర్ణయమని ధ్వజమెత్తాడు. గాయాలతో ఆటగాళ్లు దూరమైనా, స్వదేశంలో టెస్టులు జరుగుతున్నా.. కుల్‌దీప్‌ను జట్టులోకి తీసుకోలేదు. ఇక అతడు ఎలాంటి సందర్భాల్లో జట్టులో ఉంటాడని సోషల్ మీడియా కేంద్రంగా ప్రశ్నించాడు.
మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా గాయంతో జడేజా జట్టుకు దూరమవ్వడంతో కుల్‌దీప్ జట్టులో ఉంటాడని భావించానని తెలిపాడు. రవిచంద్రన్ అశ్విన్‌తో పాటు యువ స్పిన్నర్లు వాషింగ్టన్ సుందర్, షాబాజ్ నదీమ్ జట్టులో చోటు సంపాదించారు. అయితే ఆస్ట్రేలియా పర్యటనలోనూ కుల్‌దీప్‌కు నిరాశే మిగిలింది. నాలుగు టెస్టుల్లోనూ అతడికి అవకాశం రాలేదు. 2019 జనవరిలో సిడ్నీ వేదికగా కుల్‌దీప్ ఆఖరి టెస్టు ఆడాడు. చెన్నై వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో కుల్‌దీప్‌కు చోటు దక్కని విషయం తెలిసిందే.