
తెలంగాణకు మరోసారి వాతావరణ శాఖ వర్ష సూచనలు జారీ చేసింది. ఇవాళ, రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి వర్షాలుకురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కొన్ని ప్రాంతాలలో ఉరుములు, మెరుపుల, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. నైరుతి బంగాళాఖాతంలో తమిళనాడు తీరం వెంబడి సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని దాని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా నేడు, రేపు మోస్తారు నుంచి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
ఇవాళ తెలంగాణ లోని అన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ప్రధానంగా రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, హైదరాబాద్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
మంగళవారం తెలంగాణ లోని ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది
వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా వర్షాలు పడే ప్రాంతాల ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వర్షాల టైంలో అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రావొద్దని కోరుతున్నారు. హైదరాబాద్ నగరంలోనూ వర్షం కురిసే అవకాశం ఉన్నందున నగరవాసులు అప్రమత్తంగా ఉండాలన్నారు అధికారులు సూచించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.