Rain Alert: తెలంగాణకు రెండు రోజుల పాటు వర్ష సూచన.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ !

బంగాళఖాతంలో ఉపరితల ఆవర్తనం, నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో.. శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలతో పాటు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదరు గాలుల వీస్తాయని వాతవరణ శాఖ తెలిపింది.

Rain Alert: తెలంగాణకు రెండు రోజుల పాటు వర్ష సూచన.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ !
Rains

Updated on: Jun 21, 2025 | 7:31 AM

బంగాళఖాతంలో ఉపరితల ఆవర్తనం, నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో.. శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలతో పాటు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదరు గాలుల వీస్తాయని వాతవరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. శనివారం, ఆదివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కొన్ని జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతేకాకుండా.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

ఇక శనివారం తెలంగాణ లోని ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాల పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

తెలంగాణలో ఉష్ణోగ్రతలు..

ఇక ఉష్ణోగ్రతల విషయానికి వస్తే శనివారం తెలంగాణలోని ఖమ్మం1 జిల్లాలో గరిష్టంగా 37.4, మహబూబ్ నగర్ జిల్లాలో కనిష్టంగా 30.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం..

ఇదిలా ఉండగా.. బంగాళఖాతంలోని ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణలో పాటు అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం.. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది.