తీగలాగితో డొంకంతా కదులుతోంది. టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో అరెస్టు పర్వం కొనసాగుతోంది. మాస్ కాపీయింగ్ కేసులో మరో వ్యక్తి అరెస్టయ్యారు. ఈ కేసులో తెలంగాణ ప్రైవేట్ కాలేజీ అసోసియేషన్ చైర్మన్ మహబూబ్‌ను సిట్ అధికారులు అరెస్టు చేశారు. దీంతో ఇప్పటివరకు పేపర్ లీకేజీ కేసులో అరెస్ట్ అయిన వారి సంఖ్య 52కి చేరింది. మహబూబ్‌కు చెందిన కళాశాల నుంచే మాస్ కాపీయింగ్ జరిగినట్లు సిట్ అధికారులు గుర్తించారు. పరీక్షకు గైర్హాజరైన అభ్యర్థుల క్వశ్చన్ పేపర్‌ని మహబూబ్ వాట్సాప్‌లో షేర్ చేసినట్లు విచారణలో గుర్తించారు అధికారులు.
ఈ క్వశ్చన్ పేపర్‌ని డీఈ పూల రమేష్‌కు షేర్ చేసినట్లు గుర్తించారు. ఇందుకోసం మహబూబ్ 16లక్షలు తీసుకున్నట్లు నిర్ధారించారు సిట్ అధికారులు. మహబూబ్ తన కాలేజీ నుంచే డీఈ పూల రమేష్‌కి పేపర్‌ను వాట్సాప్‌లో షేర్ చేశాడు. ఇక రమేష్ ఆ పేపర్‌ను మరో 30మందికి పంపాడు. వారి నుంచి డబ్బులు వసూలు చేసినట్లు అధికారులు గుర్తించారు. పూల రమేష్ హైటెక్ రీతిలో మాస్ కాపీయింగ్‌లకు తెరలేపారు. ఏఈ పేపర్‌ను లీక్ చేయడం ద్వారా రూ. 10 కోట్లు సంపాదించాలని రమేష్ టార్గెట్‌గా పెట్టుకున్నట్లు గుర్తించారు విచారణాధికారులు. అప్పటికే అభ్యర్థుల నుంచి కోటిన్నరకు పైగా పూల రమేష్ అడ్వాన్స్ రూపంలో తీసుకున్నట్లు గుర్తించారు అధికారులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..