Telangana: సూర్యాపేటలో తీగ లాగితే.. హైదరాబాద్‌లో క‌దులుతోన్న‌ డొంక.. న‌కిలీగాళ్ల తాట తీస్తున్న పోలీసులు

|

Jun 11, 2021 | 3:39 PM

సూర్యాపేటలో తీగ లాగితే.. హైదరాబాద్ డొంక కదులుతోంది. అధికారులు, పోలీసుల కళ్లుగప్పి.. అన్నదాతను నట్టేట ముంచుతోంది నకిలీ విత్తనాల ముఠా...

Telangana: సూర్యాపేటలో తీగ లాగితే.. హైదరాబాద్‌లో క‌దులుతోన్న‌ డొంక.. న‌కిలీగాళ్ల తాట తీస్తున్న పోలీసులు
Fake Seeds
Follow us on

సూర్యాపేటలో తీగ లాగితే.. హైదరాబాద్ డొంక కదులుతోంది. అధికారులు, పోలీసుల కళ్లుగప్పి.. అన్నదాతను నట్టేట ముంచుతోంది నకిలీ విత్తనాల ముఠా. క్వింటాళ్ల కొద్ది విత్తనాలు.. కోట్ల రూపాయల విలువైన సరుకును రైతులకు అంట గడుతోంది. వానకాలం సీజన్‌ ప్రారంభం కావడంతో.. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారుల దాడులు ముమ్మరం చేశారు. సూర్యాపేట జిల్లాలో నాలుగు రోజుల క్రితం రెండు ముఠాలను పట్టుకుని 70 లక్షల రూపాయల విలువ చేసే నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్నారు పోలీసులు. దొండపాడులో 13 కోట్ల 50 లక్షల రూపాయల విలువ చేసే 960 కిలోల విత్తనం బయటపడటం షాక్‌కు గురిచేసింది. చింతలపాలెం, మఠంపల్లి మండలాల్లో మిర్చి పంట ఎక్కువగా సాగుచేస్తారు. అక్కడ నకిలీ విత్తనాలు సరఫరా అవుతున్నాయన్న సమాచారంతో పోలీసులు దొండపాడులో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో పెద్ద రాకెటే బయటపడింది.

ఎండీ మూలపాటి శివారెడ్డి.. హైదరాబాద్ వనస్థలిపురం అతను ఎంచుకున్న రహస్య ప్రదేశంలో విత్తన ప్యాకింగ్ చేపడుతున్నట్లు గుర్తించారు పోలీసులు. ఇందుకోసం ఎలాంటి అనుమతి లేదని, సర్టిఫికేషన్ అంతకన్నా లేదని గుర్తించారు. ఇవి ఏవీ లేకుండానే యదేచ్ఛగా విత్తనాలు రైతులకు అంటగడుతున్నారు. ఇక విషయం తెలుసుకోని, ఏకంగా 13కోట్ల విలువైన 960 కేజీల నకిలీ విత్తనం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

Also Read: స్విగ్గీ డెలివరీ బాయ్​గా మారిన‌ ఆడీ ఆర్​8 కార్​ ఓనర్​.. ప్రాంక్ కాదండోయ్

సీనియ‌ర్ న‌టి మీనా ఖాతాలో రేర్ అండ్ రేరెస్ట్ ఫీట్.. నెవ్వ‌ర్ బిఫోర్