పోలీసుల అయ్యప్ప మాలధారణపై ఆంక్షలు.. బ్లాక్ డ్రెస్, గడ్డం, జుట్టు పెంచుకోవడంపై నిషేధం!
తెలంగాణ పోలీసు శాఖ మతపరమైన దీక్షలపై ఆదేశాలు జారీ చేసింది. పోలీసు శాఖ డ్యూటీలో ఉన్నపుడే అయ్యప్ప దీక్ష లేదా ఇలాంటి మతపరమైన దీక్షలు చేపట్టరాదని పేర్కొంది. దీక్ష చేసే పోలీస్ సిబ్బంది తప్పనిసరిగా సెలవు తీసుకుని మాత్రమే కొనసాగించాలని వెల్లడించారు. సెలవు తీసుకోకుండా మతాచారాలు పాటిస్తే చర్యలు ఉంటాయని పోలీస్ శాఖ హెచ్చరించింది.

తెలంగాణ పోలీసు శాఖ మతపరమైన దీక్షలపై ఆదేశాలు జారీ చేసింది. పోలీసు శాఖ డ్యూటీలో ఉన్నపుడే అయ్యప్ప దీక్ష లేదా ఇలాంటి మతపరమైన దీక్షలు చేపట్టరాదని పేర్కొంది. దీక్ష చేసే పోలీస్ సిబ్బంది తప్పనిసరిగా సెలవు తీసుకుని మాత్రమే కొనసాగించాలని వెల్లడించారు. సెలవు తీసుకోకుండా మతాచారాలు పాటిస్తే చర్యలు ఉంటాయని పోలీస్ శాఖ హెచ్చరించింది. విధుల్లో ప్రిస్క్రైబ్డ్ యూనిఫాం, షూస్ ధరించాల్సిందే.. మతపరమైన పూజ, బ్లాక్ డ్రెస్, లేదా గడ్డం,జుట్టు పెంచుకోవడం అనుమతించమని పేర్కొన్నారు.
ఈ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఇటీవల ఒక ఎస్‌ఐకి మెమో కూడా జారీ చేశారు. ఈ ఘటనపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా స్పందించారు. “ఈ నిబంధనలు హిందువుల మీద మాత్రమే అమలవుతున్నాయా? ముస్లింలు రంజాన్‌లో ఉపవాసం చేస్తూ.. గడ్డం పెంచుకున్నప్పుడు ఇలాంటి ఆదేశాలు ఉండవా?” అంటూ రాజాసింగ్ ప్రశ్నించారు. ఈ సర్క్యులర్ మత స్వేచ్ఛను హరించడమేనని విశ్వ హిందూ పరిషత్, వివిధ హిందూ సంఘాల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లింలకు, ఇతర మతాలకు ఇదే రూల్స్ ఉందా? అని నిలదీస్తున్నారు. పోలీస్ యూనిఫాం తప్పనిసరి అనేది అన్ని మతాల వారికి సమానంగా వర్తిస్తుంది. కానీ ఆచరణలో సమానంగా అమలు చేస్తున్నారా అని హిందూ సంఘాల నేతలు మండిపడుతున్నారు.
వాస్తవానికి పోలీస్ శాఖ ఒక డిసిప్లిన్డ్ ఫోర్స్. అందువల్ల వీరి కార్యకలాపాల్లో యూనిఫాం, ప్రవర్తన, మతపరమైన గుర్తింపుల ధారణకు కఠిన నియమాలు ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, ఎవరైనా.. హిందువు, ముస్లిం, క్రైస్తవులు విధుల్లో ఉన్నప్పుడు మతపరమైన ఆచారాలను ప్రదర్శించకూడదు. దీక్షలు, గడ్డము, ప్రత్యేక దుస్తులు మొదలైనవి సెలవు తీసుకుని మాత్రమే పాటించాల్సి ఉంటుంది. పోలీసులు సూచించిన నిర్ణయాలు వారితో పాటు మిగతా కమ్యూనిటీలకు కూడా వర్తిస్తాయని ప్రభుత్వం చెబుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
