AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నవరాత్రుల స్పెషల్.. దసరా రోజు ప్రత్యేకంగా చేసే ప్రసాదం.. గుడాన్నం

దసరా నవరాత్రులలో అమ్మవారికి నివేదించే ప్రసాదాలలో గూడాన్నం చాలా ప్రముఖమైనది. ఇది లలితా దేవికి ఎంతో ప్రీతికరమైన నైవేద్యం. కొంతమందికి ఇది చక్కెర పొంగలిని తలపించినా, గూడాన్నంలో పెసరపప్పును వాడరు, ఇది దీని ప్రత్యేకత. తక్కువ సమయంలోనే చాలా ఈజీగా తయారుచేసుకోగలిగే ఈ సాంప్రదాయ వంటకం రుచిలో అద్భుతంగా ఉంటుంది.

Prasanna Yadla
|

Updated on: Oct 18, 2026 | 11:44 AM

Share
తయారీకి కావలసిన పదార్థాలు : బియ్యం: 1 కప్పు (పావు కిలో), నీళ్లు (బియ్యం ఉడికించడానికి): 4 కప్పులు (1 లీటరు), 
బెల్లం: అర కిలో (2.5 కప్పులు),  నీళ్లు (బెల్లం కరిగించడానికి): 1 కప్పు, నెయ్యి: అర కప్పు, పచ్చి కొబ్బరి: 1 చిప్ప (మెత్తగా తురిమి లేదా మిక్సీలో గ్రైండ్ చేసి),  జీడిపప్పు: పావు కప్పు, ఎండు ద్రాక్ష: పావు కప్పు, ఉప్పు: పావు టీ స్పూన్, యాలకుల పొడి: 1 టీ స్పూన్, పచ్చ కర్పూరం: చిటికెడు తీసుకోవాలి.

తయారీకి కావలసిన పదార్థాలు : బియ్యం: 1 కప్పు (పావు కిలో), నీళ్లు (బియ్యం ఉడికించడానికి): 4 కప్పులు (1 లీటరు), బెల్లం: అర కిలో (2.5 కప్పులు), నీళ్లు (బెల్లం కరిగించడానికి): 1 కప్పు, నెయ్యి: అర కప్పు, పచ్చి కొబ్బరి: 1 చిప్ప (మెత్తగా తురిమి లేదా మిక్సీలో గ్రైండ్ చేసి), జీడిపప్పు: పావు కప్పు, ఎండు ద్రాక్ష: పావు కప్పు, ఉప్పు: పావు టీ స్పూన్, యాలకుల పొడి: 1 టీ స్పూన్, పచ్చ కర్పూరం: చిటికెడు తీసుకోవాలి.

1 / 5
ముందుగా 1 కప్పు బియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. గూడాన్నం కోసం అన్నం చాలా మెత్తగా ఉడకాలి కాబట్టి, ఒక మందపాటి గిన్నెలో కడిగిన బియ్యం వేసి, 4 కప్పుల నీళ్లు పోయాలి. అంటే, పావు కిలో బియ్యానికి ఒక లీటరు నీళ్లు అవసరం. మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో అన్నం మెత్తగా ఉడికేంత వరకు ఉడికించాలి. కావాలంటే అరగంట నానబెట్టి కూడా ఉడికించవచ్చు.

2 / 5
అన్నం ఉడికేలోపు, అర కిలో బెల్లాన్ని తురిమి పెట్టుకోవాలి. ఈ బెల్లంలో ఒక కప్పు నీళ్లు పోసి, స్టవ్ పైన పెట్టి బెల్లం పూర్తిగా కరిగేంత వరకు వేడి చేయాలి. పాకం రానవసరం లేదు, కేవలం బెల్లం కరిగి నీళ్లుగా మారితే సరిపోతుంది. కరిగిన బెల్లం నీళ్లను పక్కన ఉంచాలి.
పచ్చి కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా బ్లెండ్ చేసుకోవాలి.

అన్నం ఉడికేలోపు, అర కిలో బెల్లాన్ని తురిమి పెట్టుకోవాలి. ఈ బెల్లంలో ఒక కప్పు నీళ్లు పోసి, స్టవ్ పైన పెట్టి బెల్లం పూర్తిగా కరిగేంత వరకు వేడి చేయాలి. పాకం రానవసరం లేదు, కేవలం బెల్లం కరిగి నీళ్లుగా మారితే సరిపోతుంది. కరిగిన బెల్లం నీళ్లను పక్కన ఉంచాలి. పచ్చి కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా బ్లెండ్ చేసుకోవాలి.

3 / 5
అన్నం పూర్తిగా ఉడికి, మెత్తగా అయిన తర్వాత, గరిటెతో బాగా మెదిపేయాలి. దధ్యోజనానికి అన్నాన్ని ఎలా మెదుపుతామో, అలాగే మెత్తగా చేయాలి. మెదిపిన అన్నంలో కరిగించుకున్న బెల్లం నీళ్లను వడపోసి పోయాలి. అడుగంటకుండా మీడియం ఫ్లేమ్‌లో కలుపుతూ ఉడికించాలి. అన్నం బెల్లం  పాకంలో కలిసే వరకు కుక్ చేయాలి.

4 / 5

అర కప్పు నెయ్యిని కొద్దికొద్దిగా  కలుపుతూ ఉండాలి. నెయ్యిని అడుగు నుంచి కలుపుతూ, గూడాన్నం పూర్తిగా దగ్గరపడి, మెరుస్తూ కనిపించేంత వరకు దాదాపు 15-20 నిమిషాలు ఉడికించాలి. ఈ ప్రక్రియ గూడాన్నానికి మంచి రుచినిస్తుంది. ఒక చిన్న కడాయిలో పావు కప్పు నెయ్యి వేడి చేసి, జీడిపప్పు వేసి గోల్డెన్ కలర్ వచ్చేవరకు వేయించాలి.  ఆ తర్వాత ఎండు ద్రాక్ష కూడా వేసి అవి పొంగేంత వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి. దగ్గరపడిన గూడాన్నంలో, మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరి తురుము, పావు టీ స్పూన్ ఉప్పు, ఒక టీ స్పూన్ యాలకుల పొడి, చిటికెడు పచ్చ కర్పూరం, వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి అడుగు నుంచి బాగా కలిపేయాలి.

5 / 5
Follow Us
మైసూరులో ప్రపంచస్థాయి ప్లానిటోరియం ప్రారంభించిన ప్రధాని మోదీ

ఏంటమ్మా మా ఊరికొచ్చావ్.. దెబ్బకు దండోరా వేయించిన గ్రామస్థులు..

OTTలో బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్..ఇప్పుడు తెలుగులోనూ చూడొచ్చు

'ఇంకొక్కసారి నన్ను చంపకు రామా'.. జటాయువు పలికిన ఈ మాటల వెనుక..

'మాయలేడి' సినిమా రివ్యూ..
'మాయలేడి' సినిమా రివ్యూ..
భారత జట్టుకు భారీ షాక్.. ఒక్క ఓటమితో నాలుగు రికార్డులు బ్రేక్

10 గ్రాముల బంగారం ధర లక్షకు పడిపోతుందా..? మార్కెట్ అంచనా ఇదే..

ఇంట్లో టమాటాలు ఉన్నాయా? ఇలా వారానికి మూడుసార్లు చేసినా వద్దనరు..

సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య

మీ ఊరు,వార్డు ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందా.. లేదా..? తెలుసుకోండిలా

డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌

12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా

మీకు నచ్చినట్లు మార్చేస్తారా? " రామాయణ" మేకర్స్ పై ముఖేష్ ఖన్నా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా?
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు

ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!

ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!

బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..

ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు

అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో