OTT Movie: బెస్ట్ ఫ్రెండ్ ట్రాన్స్జెండర్ అయితే.. ఓటీటీలోకి కీర్తి సురేష్ కాంట్రవర్సీ మూవీ.. అధికారిక ప్రకటన
ఇటీవలే థియేటర్లలో రిలీజైన ఈ సినిమాను చూసి ఆడియెన్స్ షాక్ అయ్యారు. ఇదేం ట్విస్టురా.. బాబూ అని నోరెళ్ల బెట్టారు. అదే సమయంలో ఈ మూవీపై వివాదాలు కూడా తలెత్తాయి. చివరకు ఈ కాంట్రవర్సీ మూవీని బ్యాన్ చేయాలన్న డిమాండ్లు కూడా వచ్చాయి.

మహానటి కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ సినిమా డోరతి. తమిళంలో విలక్షణ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న కార్తీక్ సుబ్బరాజు ఒక విభిన్నమైన కథతో సినిమాను తెరకెక్కించారు. రిషికాంత్, సనంత్ హీరోలుగా నటించారు. ట్రాన్స్జెండర్, LGBTQ+ అంశాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 25న తమిళంలో విడుదలైంది. అక్కడ సూపర్ హిట్ టాక్ రావడంతో అక్టోబర్ 02న తెలుగులోనూ ఈ సినిమాను రిలీజ్ చేశారు. స్పిరిట్ మీడియా ద్వారా హీరో రానా దగ్గుబాటి ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం విశేషం. కాగా ఈ సినిమా కథ, కథనం, అలాగే సన్నివేశాలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. చివరికీ ఈ సినిమాను బ్యాన్ చేయాలన్న డిమాండ్లు కూడా తలెత్తాయి. అయితే అన్నీ వివాదాలు, అడ్డంకులను తట్టుకుని డోరతి సినిమా మంచి కలెక్షన్లు రాబట్టింది. విమర్శకుల ప్రశంసలు కూడా వచ్చాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ సైతం ఈ సినిమాను చూసి చిత్ర బృందాన్ని అభినందించారు. ఇలా మొత్తానికి కాంట్రవర్సీతోనే కలెక్షన్లు రాబట్టిన డోరతి సినిమా నెల రోజులు తిరక్కుండానే ఓటీటీలోకి వచ్చేసింది. తాజాగా ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ పై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.
డోరతి సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 23 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్లు నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ ఒకేసారి డోరతి స్ట్రీమింగ్ చేయనున్నారు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. డోరతి అంటే తెలుగులో దేవుడు ఇచ్చిన కానుక అని అర్థం. 1980ల నాటి కాలం నేపథ్యంలో సాగే డోరతి చిత్రంలో ఇద్దరు బాల్య మిత్రుల జీవితాల్లోకి ఒక మహిళ ప్రవేశించిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయనేది ప్రధాన కథాంశం. తన లైంగిక గుర్తింపును తెలుసుకునే క్రమంలో ఒక ట్రాన్స్జెండర్ ఎదుర్కొన్న సవాళ్లను, సమాజం వారి పట్ల చూపించే వైఖరిని హృద్యంగా ఆవిష్కరించారు డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు. థియేటర్లలో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా ఓటీటీలో ఏ మేర ఆకట్టుకుంటుందో చూడాలి.
నెట్ ఫ్లిక్స్ లో డోరతి సినిమా..
#Dorothy will be streaming from October 23 on Netflix in #Tamil, #Telugu, #Kannada, #Malayalam & #Hindi Languages https://t.co/M388dlab6P
— Yours Cinema (@YoursCinema) October 18, 2026
డోరతి సినిమా ట్రైలర్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




