AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సూపర్ చిట్కా.. ఇదొక్కటి వేస్తే ఎంత ముదురు మటన్ అయినా త్వరగా, మెత్తగా ఉడికిపోద్ది..

మటన్ ఎంత ముదురుగా ఉన్నా మెత్తగా ఉడికించేందుకు పచ్చి బొప్పాయి పేస్ట్‌తో మ్యారినేట్ చేయడం ఒక చిట్కా. ఇందులోని పపైన్ ఎంజైమ్ మాంసం మెత్తబడటానికి సహాయపడుతుంది. ధనియాలు, మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, జీడిపప్పు వంటి పదార్థాలతో ప్రత్యేక మసాలా తయారుచేసి, మటన్‌తో కలిపి ఉడికిస్తే రుచికరమైన కర్రీ సిద్ధమవుతుంది. దసరా పండుగకు బిర్యానీ లేదా బగారా అన్నంతో ఈ మటన్ కర్రీని వడ్డించవచ్చు.

Shaik Madar Saheb
|

Updated on: Oct 18, 2026 | 11:07 AM

Share
పండుగల వేళ ప్రత్యేక వంటకాలు చేసుకోవడం భారతీయ సంప్రదాయం.. ముఖ్యంగా.. మంసాహార ప్రియులకు నాన్ వెజ్ ఉండాల్సిందే.. ఇక దసరా పండగకి అయితే.. మటన్ పక్కాగా ఉండాల్సిందే.. ఈ దసరాకు రుచికరమైన, త్వరగా చేసే మటన్ కర్రీని గురించి తెలుసుందాం.. ఈ రెసిపీ మీ పండుగ భోజనానికి ప్రత్యేకతను చేకూరుస్తుంది. బిర్యానీ లేదా.. బగారా.. ఏ కాంబినేషన్‌లో అయినా.. మటన్ కర్రీ అద్భుతంగా ఉంటుంది. ఎంత ముదురు మటన్ అయినా.. తొందరగా ఉడికిపోవాలంటే ఈ టిప్స్ పాటించండి..

1 / 6
మంచి మటన్‌ను తీసుకుని.. శుభ్రం చేసుకోండి.. అనంతరం కొద్దిగా పచ్చి బొప్పాయి ముక్కల పేస్ట్ కలిపి మ్యారినేట్ చేయాలి. ఇందులో ఉండే 'పపైన్' అనే ఎంజైమ్ మటన్ త్వరగా ఉడకడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా.. ముదురు మాంసాన్ని మెత్తగా అయ్యేలా చేస్తుంది..

2 / 6
ఈ మటన్ కర్రీ తయారీకి ముందుగా ఒక పాన్‌లో ధనియాలు, మిరియాలు, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, జీలకర్ర, షాహిజీరా, జాపత్రి, జాజికాయ, చిరోంజి, జీడిపప్పు, తర్బూజా గింజలు వేసి దోరగా వేయించాలి. సువాసన రాగానే తీసి చల్లార్చి, పొడి చేసుకోవాలి.

3 / 6
తరువాత, మరో పాన్‌లో కొద్దిగా నూనె వేసి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొంచెం ఉప్పు కలిపి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. పసుపు, దంచిన అల్లం, మటన్ ముక్కలు వేసి నూనె పైకి తేలేంత వరకు వేయించాలి. తరువాత సరిపడా నీళ్లు పోసి మటన్‌ను సగం ఉడికించాలి.

4 / 6
సగం ఉడికిన మటన్‌లో పచ్చిమిరపకాయలు వేసి, మటన్ పూర్తిగా ఉడికిన తర్వాత పెరుగు, కారప్పొడి, మనం తయారుచేసుకున్న మసాలా పొడి, పుదీనా ఆకు, కొత్తిమీర వేసి, ఉప్పు సరిచూసుకోవాలి. మరో ఐదు నిమిషాలు ఉడికించి, నూనె పైకి తేలగానే దించేయాలి.

5 / 6
ఈ రుచికరమైన దసరా స్పెషల్ మటన్ కర్రీని బిర్యానీ లేదా బగారా అన్నంతో వేడి వేడిగా వడ్డిస్తే అద్భుతంగా ఉంటుంది. ఈ పండుగకు ఈ వంటకాన్ని ఆస్వాదించండి.

6 / 6
Follow Us