AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jailer 2: బాక్సాఫీస్ వద్ద రజినీ సంచలనం.. వసూళ్లతో థియేటర్లను షేక్ చేస్తున్న జైలర్ 2.. మూడు రోజుల్లో ఎంతంటే..

సూపర్‌స్టార్ రజినీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో వచ్చిన మోస్ట్ అవేటెడ్ మాస్ ఎంటర్‌టైనర్ 'జైలర్ 2' బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో ఊచకోత కోస్తోంది. మొదటి భాగం విజయాన్ని మించిపోయేలా ఉన్న మాస్ ఎలివేషన్లు, అనిరుధ్ ఇచ్చే గూస్‌బంప్స్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ఈ చిత్రం కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి తలైవా బాక్సాఫీస్ సత్తాను మరోసారి నిరూపించింది.

Rajitha Chanti
|

Updated on: Oct 18, 2026 | 11:43 AM

Share
సూపర్‌స్టార్ రజినీకాంత్, క్రియేటివ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో వచ్చిన మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ 'జైలర్ 2' బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. మొదటి భాగం తెచ్చిపెట్టిన అపారమైన క్రేజ్‌తో భారీ అంచనాల నడుమ ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్, థియేటర్లలో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదేలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ చిత్రం, కేవలం మూడే రోజుల్లోనే ఊహించని రికార్డులను తిరగరాసింది.

1 / 5
బాక్సాఫీస్ వర్గాల నివేదికల ప్రకారం, 'జైలర్ 2' మూవీ కేవలం 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్ల గ్రాస్ వసూళ్ల అరుదైన మైలురాయిని దాటేసింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు ఓవర్సీస్‌లోనూ ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా నార్త్ ఇండియా , యూఎస్, మలేషియా వంటి అంతర్జాతీయ మార్కెట్లలో రజినీక్రాజ్ ఏమాత్రం తగ్గలేదని ఈ కలెక్షన్లు నిరూపిస్తున్నాయి. శని, ఆదివారాల్లో థియేటర్లన్నీ హౌస్‌ఫుల్ బోర్డులతో దర్శనమిచ్చాయి.

2 / 5
దర్శకుడు నెల్సన్ మరోసారి తన వినూత్నమైన టేకింగ్, మాస్ ఎలివేషన్లతో థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు తెప్పించారు. టైగర్ ముత్తువేల్ పాండ్యన్‌గా రజినీకాంత్ చూపించిన స్వాగ్, గూస్‌బంప్స్ తెప్పించే యాక్షన్ సీన్లు మరియు అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచాయి. దానికితోడు చిత్రంలో ఉన్న సర్ ప్రైజ్ క్యామియో పాత్రలు, ఫస్ట్ హాఫ్‌లోని కామెడీ , సెకండ్ హాఫ్‌లోని హై-వోల్టేజ్ యాక్షన్ బ్లాక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

3 / 5
వీకెండ్‌లో సాధించిన ఈ భారీ వసూళ్లతో 'జైలర్ 2' లాంగ్ రన్‌లో మరిన్ని ఆల్‌టైమ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. ట్రేడ్ పండితుల అంచనా ప్రకారం, ఈ చిత్రం రాబోయే రోజుల్లో రూ. 500 కోట్ల మార్కును చాలా సులువుగా దాటే అవకాశం ఉంది. రజినీకాంత్ మాస్ మేనియాకు తిరుగులేదని ఈ సినిమా సాధిస్తున్న కలెక్షన్లు మరోసారి నిరూపించాయి. 'జైలర్' విజయానికి అనిరుధ్ రవిచందర్ బిజీఎమ్  ఎంత పెద్ద ప్లస్ అయ్యిందో తెలిసిందే. 'జైలర్ 2'లో కూడా రజినీకాంత్ ఎలివేషన్ సీన్ల కోసం అనిరుధ్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థియేటర్లలో ప్రేక్షకులకు మైండ్ బ్లోయింగ్ ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తోంది.

4 / 5
ఈ చిత్రంలో రజినీకాంత్‌తో పాటు మొదటి భాగంలో మెరిసిన మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, కన్నడ హ్యాట్రిక్ హీరో శివరాజ్‌కుమార్, రమ్యకృష్ణ తమ పాత్రల్లో మరోసారి కనిపించారు. ఇక ఈ చిత్రంలో ఈ సీక్వెల్‌లో బాలీవుడ్ నటి విద్యాబాలన్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అదరగొట్టింది. విజయ్ సేతుపతి, మిథున్ చక్రవర్తి , ఎస్.జె. సూర్య ప్రధాన పాత్రల్లో కనిపించి సినిమా రేంజ్‌ను పెంచేశారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించిన ఈ చిత్రం సుమారు రూ. 300 కోట్ల నుండి రూ. 350 కోట్ల అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కింది.

5 / 5
Follow Us