Telangana Police న్యాయస్థానంలో నేరస్థులకు శిక్ష పడేలా తెలంగాణ పోలీసుల యాక్షన్ ప్లాన్..!

| Edited By: Balaraju Goud

Aug 04, 2024 | 6:05 PM

శాంతి భద్రతల విషయంలో తెలంగాణ పోలీసులు పక్కా ఫ్లాన్‌తో వెళ్తున్నారు. ముఖ్యంగా డ్రగ్స్, గంజాయి మత్తు వదిలించేందుకు రేవంత్ సర్కార్ చిత్తశుద్ధితో ముందుకెళ్తోంది. మరోవైపు నేరస్థుల పట్ల అంతే కఠినంగా ఉండాలని నిర్ణయించింది.

Telangana Police న్యాయస్థానంలో నేరస్థులకు శిక్ష పడేలా తెలంగాణ పోలీసుల యాక్షన్ ప్లాన్..!
Telangana Police
Follow us on

శాంతి భద్రతల విషయంలో తెలంగాణ పోలీసులు పక్కా ఫ్లాన్‌తో వెళ్తున్నారు. ముఖ్యంగా డ్రగ్స్, గంజాయి మత్తు వదిలించేందుకు రేవంత్ సర్కార్ చిత్తశుద్ధితో ముందుకెళ్తోంది. మరోవైపు నేరస్థుల పట్ల అంతే కఠినంగా ఉండాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర పోలీసులు తీవ్రమైన నేరాల విషయంలో దర్యాప్తు, శిక్షల పర్యవేక్షణకు ధృడమైన వ్యవస్థను అనుసరిస్తున్నారు. నేరాలలో నేరస్తులకు శిక్ష విధించేందుకు తీసువచ్చిన సంస్కరణలు సత్ఫలితాలను ఇస్తున్నాయి.

ప్రస్తుత 2024వ సంవత్సరంలో నేరస్తులు శిక్షల నుండి తప్పుకోకుండా పక్కాగా వ్యవహారిస్తున్నారు తెలంగాణ పోలీసులు. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా ఎంఎస్‌జే కోర్టు తాజాగా విధించిన మరణశిక్ష కూడా ఉంది. నార్సింగి పోలీస్ స్టేషన్ పరధిలో 2012లో పొక్సో చట్టం కింద నమోదైన కేసులో సంచలన తీర్పు వెలువడింది. ఒక చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసిన కేసులో ఎంఎస్‌జే కోర్టు మరణశిక్ష విధించింది.

2024వ సంవత్సరంలో తెలంగాణ వ్యాప్తంగా అత్యధికంగా పోక్సో కేసులలో శిక్షలు పడ్డాయి. ఈ క్రమంలోనే 15 మందికి 20 ఏళ్ల శిక్ష, ఇద్దరికి 25 ఏళ్ల శిక్ష, 11 మందికి జీవిత ఖైదుతో కలిపి మొత్తం 28 మందికి శిక్షలు విధించాయి అయా కోర్టులు. అత్యధికంగా హైదరాబాద్, రాచకొండలో కమిషనరేట్ల పరిధిలో ఐదు చొప్పున నేరస్థులకు శిక్షలు విధించారు. నేరస్థులకు శిక్షలు పడటంలో పోలీసు యంత్రాంగం వ్యవహారించిన తీరు ప్రశంసనీయం. తప్పు చేసిన వ్యక్తి తప్పించుకోకుండా పక్కా ఆధారాలతో నేరం రుజువు చేస్తూ, చార్జ్‌షీట్ దాఖలు చేయడంతో తెలంగాణ పోలీసులు విజయం సాధించారు.

దర్యాప్తు అధికారులు, పర్యవేక్షణ అధికారులు కృషి చేయడం వల్ల ఇది సాధ్యమైంది. పకడ్బందీగా దర్యాప్తు చేయడం వల్ల నేరస్తులకు శిక్ష పడే అవకాశం ఉంటుంది. భరోసా కేంద్రాల ద్వారా బాధితులకు మద్దతు ఇవ్వడం వల్ల బాధితులను సాధికారత చేయడానికి సహాయపడింది. భరోసా కేంద్రాలు బాధితులకు మద్దతు ఇచ్చే వాతావరణాన్ని అందిస్తాయి. కేసుల విచారణ సమయంలో వారికి మద్దతు ఇస్తాయి.

ముఖ్యంగా మహిళలు, చిన్నారులపై నేరాలకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. వారిపై జరుగుతున్న నేరాల్లో అధిక శాతం దాదాపు 95% నేరాలు పరిచయమున్న వ్యక్తులే చేస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్ తాజాగా స్టాఫ్ అధికారులు, యూనిట్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో నేరస్తుల శిక్ష విధించేందుకు దర్యాప్తు నాణ్యతపై అధికారులు ప్రాధాన్యత ఇవ్వాలని పునరుద్ఘాటించారు. మహిళలు, పిల్లలపై నేరాలు ఏ మాత్రం సహించేది లేదన్నారు డీజీపీ. ఈ ముఖ్యమైన నేరస్తుల శిక్షలను విధించడంలో భరోసా కేంద్రాలు, దర్యాప్తు అధికారులు, కోర్టు డ్యూటీ అధికారులు, ప్రాసిక్యూటర్ల పాత్రను ఆయన అభినందించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..