TS SSC Exams: తెలంగాణా(Telangana)లో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు వాయిదా వేస్తూ ఎస్ఎస్సీ బోర్డు తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ తల్లిదండ్రుల సంఘం(TPA) అభ్యంతరం తెలిపింది. అంతేకాదు పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ లోనే నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది. రోజు రోజుకీ ఎండలు పెరిగిపోతున్నాయని.. మండుటెండల్లో విద్యార్థులను ఎలా పరీక్షలు రాయమని చెబుతారంటూ టీపీఏ సంఘం మండిపడుతుంది. అసలు విద్యా సంత్సరం ఏప్రిల్ 23 తో ముగుస్తుంటే.. ఏప్రిల్ నెలాఖరులో పరీక్షల నిర్వహణ ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. విద్యార్థుల గురించి ఏ మాత్రం ఆలోచించకుండా ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో బోర్డు పునరాలోచించాని కోరుతుంది.
అంతేకాదు ఫీజుల నియంత్రణపై స్కూల్ లెవెల్ కమిటీలతో ఒరిగేదేమీ లేదని తెలంగాణ తల్లిదండ్రుల సంఘం వ్యాఖ్యానిస్తోంది. తమిళనాడు తరహాలో మూడేళ్లకోసారి రాష్ట్ర స్థాయి కమిటీనే నిర్ణయించాలని డిమాండ్ చేస్తోంది. ఏటా 10శాతం ఫీజు పెంచుకునే వీలు స్కూల్స్ ఉండడం పై తీవ్ర అభ్యతరం తెలుపుతోంది తెలంగాణ తల్లిదండ్రుల సంఘం.