Telangana: ట్రెక్కింగ్ స్పాట్‌గా పాండవుల గుట్ట.. ట్రెక్కింగ్ నిర్వహించిన కలెక్టర్‌, ఎస్పీ

| Edited By: Subhash Goud

Sep 29, 2024 | 7:47 PM

భూపాలపల్లి జిల్లాలో ప్రసిద్ధిగాంచిన పాండవుల గుట్టను పర్యాటక ప్రాంతంగా, ట్రెక్కింగ్ స్పాట్ అభివృద్ధి చేయడానికి చర్యలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా జిల్లా కలెక్టర్, ఎస్‌పీ పాండవుల గుట్టపై ట్రెక్కింగ్ నిర్వహించి వీకెండ్ త్రిల్లింగ్ గా గడిపారు. భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పి కిరణ్ ఖారే..

Telangana: ట్రెక్కింగ్ స్పాట్‌గా పాండవుల గుట్ట.. ట్రెక్కింగ్ నిర్వహించిన కలెక్టర్‌, ఎస్పీ
Follow us on

భూపాలపల్లి జిల్లాలో ప్రసిద్ధిగాంచిన పాండవుల గుట్టను పర్యాటక ప్రాంతంగా, ట్రెక్కింగ్ స్పాట్ అభివృద్ధి చేయడానికి చర్యలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా జిల్లా కలెక్టర్, ఎస్‌పీ పాండవుల గుట్టపై ట్రెక్కింగ్ నిర్వహించి వీకెండ్ త్రిల్లింగ్ గా గడిపారు. భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పి కిరణ్ ఖారే తో కసిలి పాండవుల గుట్టను సందర్శించి ట్రెక్కింగ్ చేశారు. గుట్టపైకి వెళ్లి పరిసర ప్రాంతాలను పరిశీలించారు.

పాండవుల గుట్ట సాంస్కృతిక, చారిత్రక ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని పర్యాటకులను ఆకర్షించేలాగా ముఖ్యమైన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించనున్నట్లు తెలిపారు. పర్యాటకులకు మౌలిక సదుపాయాలు కల్పన, పర్యాటకుల సౌకర్యార్థం రోడ్లు, పార్కింగ్ స్థలాలు, రిసాట్స్ తదితర సౌకర్యాలు కల్పనతో పాటు పర్యాటకులు రాత్రి బసచేసేందుకు కాటేజిలు తదితర సౌకర్యాలు కల్పనకు చర్యలు చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. పాండవుల గుట్ట అద్భుతమైన పర్యాటక ప్రాంతమని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయుటకు చక్కటి అవకాశం ఉందని అన్నారు.

తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా దేశ, విదేశాల నుండి అత్యధికంగా పర్యాటకులను ఆకర్షించడానికి తద్వారా ఈ ప్రాతం పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి జరగడం వల్ల ఈ ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయనని అన్నారు. పాండవుల గుట్ట చారిత్రక ప్రాముఖ్యత ఉన్న ప్రాంతం ఇక్కడి రాతి శిల్పాలు, పాండవుల కాలం నాటి నిర్మాణాలను కాపాడటంతో పాటు గుట్టలు దెబ్బతినకుండా రక్షించేందుకు అవకాశం ఉన్నట్లు తెలిపారు.

ఈ ప్రాంతాన్ని పర్యాటకులకు, చరిత్ర ప్రియులకు పరిచయం చేయడానికి రాష్ట్ర పర్యాటక శాఖ ద్వారా విస్తృత ప్రచారం చేస్తామని, అలాగే సాంస్కృతిక ప్రదర్శనలు, ఉత్సవాలు నిర్వహించడం ద్వారా ఈ ప్రాంత పర్యాటక ఆకర్షణను పెంచడానికి అవకాశం ఉన్నట్లు తెలిపారు. పర్యాటకులు పెద్ద సంఖ్యలో వచ్చే విధంగా పాండవుల గుట్ట పర్యటనకు ప్రత్యేక ప్యాకేజీలు రూపొందించడానికి ప్రతిపాదనలు తయారుకు ప్రతి పాదనలు సిద్ధం చేయనున్నట్లు తెలిపారు. ఇందులో గైడ్ సేవలు, ట్రెక్కింగ్, సాంస్కృతిక కార్యక్రమాలను కూడా జత చేసే అంశాలపై ప్రణాళికలు తయారు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ ప్రాంతం పరిసరాలు, ప్రకృతి సంపదను కాపాడటానికి, పర్యాటకులు జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని అన్నారు. సందర్శించిన పర్యాటకులు గుర్తుగా తీసుకెళ్లడానికి స్మారక వస్తువులు, స్థానిక హస్తకళలు అందించే స్టోర్లు ఏర్పాటు చేయడం వల్ల స్థానిక ఆర్థిక వ్యవస్థకు దోహదపడుతుందని అన్నారు. ఈ విధంగా చర్యలు తీసుకుంటే పాండవుల గుట్ట పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని జిల్లా కలెక్టర్, ఎస్పీ తెలిపారు.


మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి