TOSS SSC and Inter Results 2023: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) ఓపెన్ పదోతరగతి (ఎస్‌ఎస్‌సీ), ఇంటర్మీడియట్-2023 ఫలితాలను శుక్రవారం (జూన్ 16) విడుదల చేసింది. పదో తరగతి, ఇంటర్ పరీక్షలకు హాజరైన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ లో ఫలితాలను చెక్ చూసుకోవచ్చు. అభ్యర్థులు తమ రోల్‌నంబర్ ద్వారా మార్కుల మెమో పొందవచ్చు. రోల్ నంబర్ నమోదు చేసి పదో తరగతి, ఇంటర్ ఫలితాలు పొందవచ్చు. ఫలితాల్లో ఏవైనా సందేహాలు తలెత్తితే వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించాలని ఈ సందర్భంగా వెల్లడించింది.
ఓపెన్ ఇంటర్మీడియట్ పరీక్షలు ఏప్రిల్ 25 నుంచి మే 4వ తేదీ వరకు నిర్వహించారు. అలాగే పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 25 నుంచి మే 3 వరకు జరిగాయి. ఇతర వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.
ఓపెన్ ఇంటర్మీడియట్ పరీక్షల-2023 ఫలితాల కోసం క్లిక్ చేయండి.
ఓపెన్ పదో తరగతి పరీక్షల-2023 ఫలితాల కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.