Telangana News: మంత్రాలతో తమ బిడ్డ చంపేశాడంటూ ఆరోపణలు.. పోలీసుల ఎంట్రీతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..!

|

Dec 01, 2021 | 5:22 AM

Telangana News: అనారోగ్యం నుండి కాపాడాలంటూ దర్గా నిర్వహకుడిని ఆశ్రయిస్తే తన కామ వాంఛ తీర్చాలని కోరాడని, దానికి ఒప్పుకోకపోవడంతో మంత్రాలు చేసి తమ కూతురిని

Telangana News: మంత్రాలతో తమ బిడ్డ చంపేశాడంటూ ఆరోపణలు.. పోలీసుల ఎంట్రీతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..!
Balck Magic
Follow us on

Telangana News: అనారోగ్యం నుండి కాపాడాలంటూ దర్గా నిర్వహకుడిని ఆశ్రయిస్తే తన కామ వాంఛ తీర్చాలని కోరాడని, దానికి ఒప్పుకోకపోవడంతో మంత్రాలు చేసి తమ కూతురిని హతమార్చాడంటూ సూర్యాపేట జిల్లా కేంద్రానికి దగ్గరలోని గాంధీ నగర్ సమీపంలో గల దర్గా వద్ద ఆందోళనకు దిగిందో కుటుంబం. తమ కూతురి మృతికి అతనే కారణమంటూ దర్గా నిర్వహకుడి నిర్బంధంచిన బాధిత కుటుంబ సభ్యులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ సమస్యలను తీర్చాలని ఆశ్రయించిన వారిపై కన్నేసాడో దర్గా నిర్వహించే దొంగ బాబా. తన మంత్ర తంత్ర శక్తులు నాటు వైద్యంతో రుగ్మతలను పారాదోలుతానంటూ నమ్మించడంతో తమ అనారోగ్యాలు, సమస్యలను తీర్చాలంటూ పలువురు దొంగ బాబాని ఆశ్రయిస్తున్నారు. అయితే మీ సమస్యను తీర్చాలంటే ముందుగా తన కోరిక తీర్చాలంటూ కండిషన్ పెట్టి మహిళలను లోబరుచుకుంటున్నాడని, మాట వినని వారిపై మంత్రాలు ప్రయోగించి ప్రాణాలు తీస్తున్నాడని ఆరోపిస్తున్నారు బాధితులు.

వివరాల్లోకి వెళ్తే చివ్వేంల మండలం దురాజ్ పల్లి గ్రామానికి చెందిన దుర్గయ్య, రాజరాజేశ్వరి కుటుంబం తమకు ఏదైనా సమస్య, అనారోగ్యం వస్తే గాంధీ నగర్ సమీపంలోని దర్గా వద్దకు వెళ్ళి ప్రత్యేక పూజలు చేసే వారు. అక్కడి దర్గా నిర్వాహకుడు భిక్షపతి ఇచ్చే నాటు మందులు వాడేవారు. ఇలా కొన్ని సంవత్సరాలుగా దర్గా వద్దకి వస్తుండటంతో దర్గా నిర్వహకుడి కన్ను రాజరాజేశ్వరిపై పడింది ఎలాగైనా ఆమెను లోబరచుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో కొద్దీ రోజుల క్రితం దుర్గయ్య, రాజరాజేశ్వరిల కూతురు శ్రావణి అనారోగ్యానికి గురి కావడంతో దర్గా వద్దకు వెళ్ళి సదరు బిక్షపతికి చెప్పడంతో మంత్రించిన పసరు మందు ఇచ్చి నాటు వైద్యం చేసాడు. అదే సమయంలో రాజరాజేశ్వరిని తన కోరిక తీర్చాలని అడగడంతో అందుకు ఆమె నిరాకరించి తిరిగి దురాజ్ పల్లికి వచ్చేసింది. నాలుగు రోజుల క్రితం శ్రావణి తిరిగి అనారోగ్యానికి గురై కళ్ళు తిరిగి పడిపోయింది. దీంతో దర్గా నిర్వాహకుడుకి తెలిపి తాము ఆసుపత్రికి వెళ్తున్నామని చెప్పడంతో భిక్షపతి వారిని వారించి తన దగ్గరకు తీసుకురావాలని, తానే నయం చేస్తానని నమ్మబలకడంతో గాంధీ నగర్ దర్గాకు శ్రావణిని తీసుకెళ్లారు. తన వైద్యానికి సమయం పడుతుందని రాత్రికి ఇక్కడే నిద్రించాలని చెప్పడంతో భార్యను అక్కడే ఉంచి దుర్గయ్య ఇంటికి వెళ్ళాడు.

ఇదే అదునుగా భావించిన దర్గా నిర్వాహకుడు తిరిగి తన కోరిక తీర్చాలని రాజరాజేశ్వరిని అడిగాడు తన కోరిక తీరిస్తేనే కూతురు శ్రావణికి వైద్యం కొనసాగిస్తానని, లేదంటే మీ ఇష్టమని అల్టిమేటం ఇచ్చాడు. అయినా రాజరాజేశ్వరి అందుకు అంగీకరించలేదు. తెల్లారి లేచి చూసేసరికి శ్రావణి మృతి చెంది ఉండటంతో కోరిక తీర్చలేదని మంత్రాలు చేసి తమ కూతురిని చంపాడంటూ బిక్షపతిని నిర్బంధించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి విచారణ చేపట్టారు. నిందితుడిని పోలీస్ స్టేషన్‌కు తరలిస్తుండగా మృతురాలి బంధువులు అడ్డగించి తమకు ఇక్కడే న్యాయం చేయాలని పట్టుబడుతూ ఆందోళనకు దిగారు. తమ కూతురిని చంపినట్లుగానే దర్గా నిర్వహకుడిని చంపాలని అమాయక ప్రజలను, మహిళలను నాటు వైద్యం, మంత్రాల పేరుతో మోసం చెస్తున్న బిక్షపతికి అదే సరైన శిక్షని మృతురాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు.

Also read:

మందుబాబుల మత్తు వదల కొడతాం..ఇల్లీగల్ డీ అడిక్షన్‌ రీహాబిలిటేషన్‌ సెంటర్ల అక్రమ దందా.. టీవీ9 నిఘాలో విస్తుకొలిపే నిజాలు!

Business Idea: వాటే ఐడియా గురూ.. తండ్రి ఆసక్తి.. తనయుని వ్యాపారం.. కోట్లాది రూపాయల టర్నోవర్..

Omicron variant: ఒమిక్రాన్ వేరియంట్‌తో థర్డ్ వేవ్ వస్తుందా? కాన్పూర్ ఐఐటీ ప్రొఫెసర్ అంచనా..