Telangana: తెలంగాణలోని ఆ జిల్లాలో ఇష్టారీతిన కోతకాన్పులు.. దిమ్మదిరిగే షాక్ ఇచ్చిన అధికారులు

|

Mar 30, 2022 | 2:29 PM

Telangana News: డెలివరీ కోసం వస్తే సిజేరియన్‌ కాన్పులు చేస్తూ అక్కడి ఆస్పత్రులు కాసులు దోచుకుంటున్నాయి. సాధరణ కాల్పులను కూడా కాసుల కక్కుర్తితో సదరు ఆస్పత్రులు సిజేరియన్ చేయిస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. 

Telangana: తెలంగాణలోని ఆ జిల్లాలో ఇష్టారీతిన కోతకాన్పులు.. దిమ్మదిరిగే షాక్ ఇచ్చిన అధికారులు
Representative Image
Follow us on

Nirmal Dist News: డెలివరీ కోసం వస్తే సిజేరియన్‌ కాన్పులు చేస్తూ అక్కడి ఆస్పత్రులు కాసులు దోచుకుంటున్నాయి. సాధరణ కాల్పులను కూడా కాసుల కక్కుర్తితో సదరు ఆస్పత్రులు సిజేరియన్ చేయిస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.  ప్రభుత్వం తీసిన లెక్కల్లో నిర్మల్ జిల్లాలో నమోదవుతున్న సిజేరియన్ లతో అధికారులు విస్తుపోయారు. తెలంగాణ రాష్ట్రంలో నిర్మల్ జిల్లాలోనే అత్యధికంగా సిజేరియన్ లు నమోదవుతుండడంపై ప్రభుత్వ అధికారులు సిరీయస్ అయ్యారు. సిజేరియన్లు చేయోద్దని ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలను హెచ్చరించారు. అధికారులు మాటలు పెడచెవిన పెట్టి ఇష్టారాజ్యంగా సిజేరియన్ ఆపరేషన్లు చేస్తూనే ఉన్నారు. దీంతో నిర్మల్ జిల్లాలోని ఆరు ప్రైవేట్ ఆసుపత్రులను మంగళవారంనాడు అధికారులు సీజ్ చేశారు. సిజేరియన్ కాల్పులను కట్టడి చేసేందుకు జిల్లా అధికారులు తీసుకుంటున్న చర్యలపై సామాన్య జనం హర్షం వ్యక్తంచేస్తున్నారు.

అయితే ఆస్పత్రులను సీజ్ చేయడంపై మెడికల్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తంచేసింది. దీనికి నిరసనగా  మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రైవేట్ ఆస్పత్రులతో పాటు మెడికల్ షాపులను సైతం మూసి వేశారు. సీజ్‌ చేసిన ఆరు ప్రైవేట్ హాస్పిటళ్లను వెంటనే తెరిపించాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు.

Also Read..

బ్యాంకు మోసాలు, కుంభకోణాలతో రోజుకు రూ.100 కోట్ల నష్టం.. RBI రిపోర్ట్‌లో మరిన్ని షాకింగ్ విషయాలు

IRCTC: విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఐఆర్సీటీసీ ద్వారా బుక్ చేసుకునే బంపర్ ఆఫర్..